కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘గాలి మనకు ఎదురు వీచినప్పుడు’

‘గాలి మనకు ఎదురు వీచినప్పుడు’

‘గాలి మనకు ఎదురు వీచినప్పుడు’

గలిలయ సముద్రాన్ని పడవలో దాటడానికి ఎంతో ప్రయాసపడుతున్న యేసు శిష్యుల వాస్తవ జీవిత అనుభవాన్ని వర్ణిస్తూ సువార్త రచయితయైన మార్కు “అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడు”తున్నారని అన్నాడు. తీరానున్నప్పుడే వారి ప్రయాసను చూసి, యేసు అద్భుతరీతిగా సముద్రంపై నడుస్తూ వారిని చేరుకున్నాడు. “ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను.”—మార్కు 6:48-51.

మునుపు ఒక సందర్భంలో, అదే బైబిలు రచయిత ఒక “పెద్ద తుపాను రేగి”న విషయం గురించి నివేదించాడు. అప్పుడు యేసు, “గాలిని గద్దించి[నప్పుడు] . . . గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.”—మార్కు 4:37-39.

ఈనాడు అలాంటి అద్భుత సంఘటనలను చూసే ఆధిక్యత మనకు లేకపోయినప్పటికీ, మనం వాటినుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అపాయకరమైన కాలాల్లో నివసిస్తున్న అపరిపూర్ణ మానవులముగా, మనకు విపత్కర పరిస్థితులకు మినహాయింపు లేదు. (2 తిమోతి 3:1-5) నిజానికి కొన్నిసార్లు వ్యక్తిగత కష్టాలకు సంబంధించిన దుఃఖాలు పెనుతుపాను అంతటి తీవ్రతను చేరుకుంటున్నట్లు మనం భావించవచ్చు. కానీ ఉపశమనం ఉంది! యేసు ఇలా ఆహ్వానాన్ని అందిస్తున్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”—మత్తయి 11:28.

‘గాలి మనకు ఎదురు వీచినట్లుగా’ అన్పించినప్పుడు, మనం మనస్సు ‘మిక్కిలి నిమ్మళంగా’ ఉండే పరిస్థితిని అనుభవించవచ్చు. ఎలా? విఫలంకాని యెహోవా దేవుని వాగ్దానాలపై విశ్వాసముంచటం ద్వారా.—పోల్చండి యెషయా 55:9-11; ఫిలిప్పీయులు 4:5-7.