కంటెంట్‌కు వెళ్లు

JW బ్రాడ్‌కాస్టింగ్‌

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూసే ముందు, రోకు ప్లేయర్‌ను సెటప్‌ చేసుకొని JW బ్రాడ్‌కాస్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దానికోసం ఈ కిందున్న వాటిని చేయండి:

 రోకు ప్లేయర్‌ను సెటప్‌ చేసుకోండి

మీ రోకు ప్లేయర్‌ సెటప్‌ అయ్యి, ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యేలా నిర్దేశాలు కనిపించాలి. మీ రోకు ప్లేయర్‌ కనెక్ట్‌ అయిన తర్వాత, స్క్రీన్‌ మీద కనిపించే నిర్దేశాలను పాటిస్తూ సెటప్‌ చేయండి.

గమనిక: ఈ విధంగా సెటప్‌ చేసుకోవాలంటే, మీ కంప్యూటర్‌లో లేదా ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్‌ వంటివాటిలో ఇంటర్నెట్‌ పనిచేయాలి.

సెటప్‌ చేసుకుంటున్నప్పుడు, రోకు ప్లేయర్‌ని లింక్‌ చేయమని అడుగుతుంది. అలా చేయడానికి www.roku.com/link తెరచి, మీ టీవీ స్క్రీన్‌ మీద కోడ్‌ను ఎంటర్‌ చేయండి. అప్పుడు మీ కంప్యూటర్‌, ట్యాబ్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ వంటివాటిలో కనిపించే నిర్దేశాలను పాటిస్తే మీరు రోకు అకౌంట్‌ తెరుచుకోవచ్చు.

మీ అకౌంట్‌కు రోకు ప్లేయర్‌ లింక్‌ అయినప్పుడు, మీ టీవీ స్క్రీన్‌ రిఫ్రెష్‌ అవుతుంది.

అదనపు సహాయం కోసం, రోకు ప్లేయర్‌ను ఎలా సెటప్‌ చేసుకోవాలో చూపించే వీడియోను చూడండి.

 కంప్యూటర్‌ నుండి JW బ్రాడ్‌కాస్టింగ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి

రోకు ప్లేయర్‌లో వీడియో ప్లే చేసే సాఫ్ట్‌వేర్‌ (లేదా “ఛానెల్స్‌”) ఉంటుంది. మీరు చూడాలనుకుంటున్న వీడియోలు ఉండే ఛానెల్స్‌ను మీ రోకు ప్లేయర్‌లో చేర్చుకోవాలి. అందుకు ఓ మార్గం ఏమిటంటే కంప్యూటర్‌ ద్వారా కొత్త ఛానెల్‌ను చేర్చడం.

  • ఏదోక ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ నుండి రోకు ఛానెల్‌ స్టోర్‌లో ఉన్న JW బ్రాడ్‌కాస్టింగ్‌ పేజీకి వెళ్లండి.

  • మీరు ఇంకా లాగ్‌ ఇన్‌ అవ్వకపోతే, రోకు అకౌంట్‌లో లాగ్‌ ఇన్‌ అవ్వండి.

  • యాడ్‌ ఛానెల్‌ బటన్‌ క్లిక్‌ చేయండి. ఛానెల్‌ వచ్చాక, పచ్చ రంగులోని యాడ్‌ ఛానెల్‌ బటన్‌ స్థానంలో ఇన్‌స్టాల్డ్‌ అనే పదం కనిపిస్తుంది.

ఒకవేళ మీరు వెబ్‌బ్రౌజర్‌ నుండి ఛానెల్‌ని చేర్చుకుంటే, మీ రోకు ప్లేయర్‌లో ఆ ఛానెల్‌ ఇన్‌స్టాల్‌ అవ్వదు; కానీ మీ కంప్యూటర్‌ ఇంకా చేయాల్సిన పనుల లిస్టులోకి అది చేరుతుంది. కాబట్టి మీ రోకు ప్లేయర్‌లో కొత్తగా చేర్చిన ఛానెల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

  • రోకు రిమోటులో హోమ్‌ బటన్‌ నొక్కండి.

  • పై బాణం గుర్తును లేదా కింద బాణం గుర్తును ఉపయోగిస్తూ సెట్టింగ్స్‌ దగ్గరకు వెళ్లండి.

  • OK నొక్కండి.

  • సెట్టింగ్స్‌ పేజీలో, పై బాణం గుర్తును లేదా కింద బాణం గుర్తును ఉపయోగిస్తూ సిస్టమ్‌ అప్‌డేట్‌ దగ్గరకు వెళ్లండి. తర్వాత OK నొక్కండి. సిస్టమ్‌ అప్‌డేట్‌ పేజీ లోడ్‌ అవుతుంది. అప్పుడు మీ స్క్రీన్‌ మీద కుడివైపు చెక్‌ నవ్‌ అని కనిపించాలి.

  • OK నొక్కండి.

కంప్యూటర్‌ చేయాల్సిన పనుల లిస్టులోకి వచ్చిన ఛానెల్‌ని రోకు ప్లేయర్‌ ఇప్పుడు చెక్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేస్తుంది.

  • మళ్లీ మీ రోకు హోమ్‌ స్క్రీన్‌ దగ్గరకు వెళ్లి, అసలు మెన్యూ నుండి మై ఛానెల్స్‌ ఎంచుకోండి. ఈ స్క్రీన్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌తోసహా రోకు ప్లేయర్‌లో మీరు ఇన్‌స్టాల్‌ చేసిన అన్ని ఛానెల్స్‌ కనిపిస్తాయి.

  • JW బ్రాడ్‌కాస్టింగ్‌ను ప్రారంభించడానికి, jw.org లోగోకు వెళ్లి OK బటన్‌ నొక్కండి.

 రోకు నుండి JW బ్రాడ్‌కాస్టింగ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి

నేరుగా రోకు ప్లేయర్‌ నుండి కూడా మీరు JW బ్రాడ్‌కాస్టింగ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

  • రోకు హోమ్‌ స్క్రీన్‌కు వెళ్లండి.

  • రోకు రిమోటు మీదున్న పై బాణం గుర్తును లేదా కింద బాణం గుర్తును ఉపయోగిస్తూ సెర్చ్‌ దగ్గరకు వెళ్లండి.

  • OK నొక్కండి.

రోకు సెర్చ్‌లో మీరు టైప్‌ చేసే దానికి సరిపోయే సినిమాలు, టీవీ షోలు, నటులు, దర్శకులు, ఆటలు, ఛానెల్స్‌ రోకులో కనిపిస్తాయి. JW బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది ఒక ఛానెల్‌ కాబట్టి, సర్చ్‌ చేయగా వచ్చిన వాటిలో పక్కన వచ్చే ఛానెల్‌ గుర్తు ఎక్కడుందో చూడండి. JW బ్రాడ్‌కాస్టింగ్‌ కోసం ఈ కిందున్న పదాల్లో ఒకదాన్ని టైప్‌ చేయండి:

  • jw బ్రాడ్‌కాస్టింగ్‌

  • jw.org

  • jwtv

  • Jehovah

  • వెతకగా వచ్చిన లిస్టులో JW బ్రాడ్‌కాస్టింగ్‌ కనిస్తే, మీరు హైలైట్‌ చేసిన ఛానెల్‌ పేరు వచ్చే దాకా కుడి బాణం గుర్తును నొక్కండి, తర్వాత OK నొక్కండి. ఇప్పుడు యాడ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ హైలైట్‌ అవ్వాలి

  • JW బ్రాడ్‌కాస్టింగ్‌ ఇన్‌స్టాల్‌ చేయడానికి మళ్లీ OK నొక్కండి.

JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడానికి, గో టు ఛానెల్‌ ఎంచుకోండి లేదా మళ్లీ రోకు హోమ్‌ స్క్రీన్‌కు వెళ్లి మై ఛానెల్స్‌ కిందున్న JW బ్రాడ్‌కాస్టింగ్‌ను చూడండి.