కంటెంట్‌కు వెళ్లు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల గురించి సమాచారం

 

యెహోవాసాక్షులు-వాళ్లు ఎవరు?

యెహోవాసాక్షుల గురించి సంక్షిప్తంగా తెలుసుకోండి—వాళ్లు ఏం చేస్తారు? వాళ్లు ఎలా సంస్థికరించబడ్డారు?

యెహోవాసాక్షులు—వాళ్ల ప్రచురణలు

ముద్రిత రూపంలో అలాగే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న యెహోవాసాక్షుల ప్రచురణలు దేవునికి దగ్గరవ్వడానికి, బైబిలు బోధల్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తాయి. అంతేకాదు, అవి ప్రజల మీద సానుకూల ప్రభావం చూపిస్తాయి, జీవన విధానాన్ని మెరుగుపర్చుకునేలా సహాయం చేస్తాయి.

యెహోవాసాక్షులు—సమాజంలో చేస్తున్న పనులు

యెహోవాసాక్షులు తమ బైబిలు విద్యా పని ద్వారా, అలాగే మానవతా దృక్పథంతో చేసే సహాయక చర్యల ద్వారా తాము నివసించే సమాజం శ్రేయస్సు కోసం కృషిచేస్తారు.

యెహోవాసాక్షులు చేసే పరిచర్య

యెహోవాసాక్షులు బైబిల్లోని మంచివార్త గురించి ఇతరులకు చెప్పడం తమ ఆరాధనలో ముఖ్యమైన భాగంగా చూస్తారు. అలా చెప్పడానికి వాళ్లు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు, వాళ్లు చేసే ఈ పని సమాజం మీద ఎలాంటి మంచి ప్రభావం చూపిస్తోంది?

యెహోవాసాక్షులు—కుటుంబ జీవితం

యెహోవాసాక్షులు కుటుంబంలో బైబిలు సూత్రాలు పాటించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల భర్త, భార్య, పిల్లలు ప్రయోజనం పొందుతారు. అంతేకాదు కుటుంబంలో భద్రత, ప్రేమ ఉంటాయి. పిల్లలకు బైబిలు ప్రమాణాలు నేర్పించడాన్ని తల్లిదండ్రులు తమ ముఖ్య బాధ్యతగా చూస్తారు.

యెహోవాసాక్షులు-తరచూ అడిగే ప్రశ్నలు

యెహోవాసాక్షుల గురించి తరచూ అడిగే పది ప్రశ్నలకు జవాబులు.

యెహోవాసాక్షులు—ఆరోగ్యం

యెహోవాసాక్షులు జీవాన్ని దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతిగా చూస్తారు. వాళ్లు జీవాన్ని, రక్తాన్ని పవిత్రమైనవిగా భావిస్తారు. తమ కుటుంబం కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య చికిత్సను ఎంచుకుంటారు, సురక్షితమైన-సమర్థమైన రక్తరహిత వైద్య చికిత్సలు అందించే విషయంలో డాక్టర్లతో సంతోషంగా సహకరిస్తారు.

యెహోవాసాక్షులు—ప్రత్యామ్నాయ పౌర సేవ

మనస్సాక్షి కారణంగా మిలిటరీ సేవను నిరాకరించడం ప్రాథమిక హక్కు అని చాలాకాలం నుండి అంతర్జాతీయ చట్టం గుర్తిస్తోంది. దేశాలు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ శిక్షలేని, సమాజానికి ఉపయోగపడే నిజమైన ప్రత్యామ్నాయ పౌర సంబంధమైన సేవను కల్పించినప్పుడు యెహోవాసాక్షులు కృతజ్ఞతతో ఉంటారు.

యెహోవాసాక్షులు—రాజకీయ విషయాల్లో తటస్థత

బైబిలు బోధల ప్రకారం యెహోవాసాక్షులు రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటారు. సాక్షుల తటస్థత శాంతికి దోహదపడుతుందని, వాళ్లు అధికారులను గౌరవించి వాళ్లతో సహకరించే, చట్టానికి లోబడి ఉండే బాధ్యతగల పౌరులని చాలా ప్రభుత్వాలు గుర్తిస్తాయి.

యెహోవాసాక్షులు—ఆరాధన కోసం సమకూడటం

తోటి విశ్వాసులతో మీటింగ్స్‌లో కలుసుకోవడం తమ ఆరాధనలో చాలా ముఖ్యమైన భాగంగా యెహోవాసాక్షులు చూస్తారు. రాజ్యమందిరాలు అని పిలవబడే భవనాల్లో జరిగే వాళ్ల మీటింగ్స్‌లో ముఖ్యంగా బైబిలు విషయాలు నేర్పిస్తారు, వాటికి ఎవరైనా రావచ్చు.

యెహోవాసాక్షులు—విపత్తు సహాయక చర్యలు

విపత్తులు జరిగినప్పుడు యెహోవాసాక్షులు వెంటనే స్పందించి భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సహాయం చేస్తారు. వాళ్లు చక్కగా ప్లాన్‌ చేసి చేసే సహాయక చర్యల్ని ప్రభుత్వ అధికారాలు, విపత్తు సహాయక సంస్థలు గుర్తిస్తారు.