బైబిలు ప్రాంతాలు
‘మంచి దేశమును చూడండి’ అనే బ్రోషురు ఒకరకమైన బైబిలు అట్లాస్. దీని సహాయంతో మీరు బైబిల్ని ఇంకా లోతుగా అర్థంచేసుకోవచ్చు. బైబిల్లో ఎన్నో ప్రాంతాల పేర్లు, నగరాల పేర్లు, దేశాల పేర్లు ఉన్నాయి. ఆ ప్రదేశాలు ఎక్కడ ఉండేవో, ఎలా ఉండేవో ఊహించుకోవడానికి ‘మంచి దేశమును చూడండి’ బ్రోషురు సహాయం చేస్తుంది. ఆ ప్రదేశాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు-ఇతర భౌగోళిక అంశాలకు, అక్కడ జరిగిన సంఘటనలకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
‘మంచి దేశమును చూడండి’ బ్రోషురులో రంగురంగుల మ్యాప్‌లు, బైబిలు కాలాల్లోని వివిధ ప్రదేశాల చార్టులు, బొమ్మలు, కంప్యూటర్ సహాయంతో గీసిన చిత్రాలు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. దీన్ని వాడితే బైబిలు చదవడం బోర్ కొట్టకుండా ఇంకా చదవాలనిపిస్తుంది.
ఈ బైబిలు అట్లాస్ సహాయంతో మీరు …
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు తిరిగిన ప్రదేశాలను తెలుసుకోవచ్చు
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణించిన మార్గం ఎలా ఉండేదో చూడవచ్చు
శత్రు దేశాలతో పోలిస్తే ఇశ్రాయేలు దేశం ఎలాంటి ప్రదేశంలో ఉండేదో చూడవచ్చు
యేసు పరిచర్య చేస్తూ ఏయే ప్రాంతాలకు వెళ్లాడో తెలుసుకోవచ్చు
బైబిల్లో ప్రస్తావించబడిన బబులోను, గ్రీసు, రోము వంటి రాజ్యాలు ఎంతవరకు విస్తరించి ఉండేవో తెలుసుకోవచ్చు
ఈ బైబిలు అట్లాస్‌ను మీరు ఆన్లైన్లో ఉచితంగా చూడవచ్చు.