కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హుల్దా తన లక్ష్యం కోసం నాలుగు రాళ్లు వెనకేసుకుంది

హుల్దా తన లక్ష్యం కోసం నాలుగు రాళ్లు వెనకేసుకుంది

కొన్నేళ్ల క్రితం ఇండోనేషియాలోని సేంగిర్‌ బేసర్‌ అనే ద్వీపానికి మీరు వెళ్లుంటే, బీచ్‌ దగ్గర మన ముగ్గురు సిస్టర్స్‌ ఒక పని చేయడాన్ని మీరు చూసుండేవాళ్లు. సాధారణంగా, బీచ్‌ దగ్గర బాగా ప్రీచింగ్‌ చేస్తారు అనే పేరు వాళ్లకుంది. కానీ ఈసారి వాళ్లు అక్కడ వేరే పని చేస్తున్నారు.

ఉత్తర ఇండోనేషియాలోని సేంగిర్‌ బేసర్‌ ద్వీపం

ముందుగా, ఆ ముగ్గురు సిస్టర్స్‌ నీళ్లలోకి వెళ్లి సముద్రంలో ఉన్న రాళ్లన్నిటినీ ఒడ్డుకు లాకొచ్చేవాళ్లు. కొన్ని రాళ్లయితే ఫుట్‌బాల్‌ అంత పెద్దవిగా ఉండేవి. వాళ్లు ఒక చోట కూర్చుని ఆ రాళ్లన్నిటినీ కోడి గుడ్డు సైజులోకి పగలగొట్టేవాళ్లు. ఆ తర్వాత, వాటిని ఒక ప్లాస్టిక్‌ బకెట్‌లోకి వేసుకుని చాలా ఎత్తులో ఉన్న వాళ్ల ఇంటికి మోసుకెళ్లేవాళ్లు. తర్వాత వాటన్నిటిని ఒక పెద్ద బ్యాగులో సర్ది, ట్రక్కుల్లో ఎక్కించేవాళ్లు. ఆ రాళ్లను రోడ్డు నిర్మాణ పనిలో ఉపయోగిస్తారు.

హుల్దా బీచ్‌లో రాళ్లను పోగేసుకుంటుంది

ఆ ముగ్గురు సిస్టర్స్‌లో ఒకరు హుల్దా. ఆమె తనకున్న పరిస్థితుల్ని బట్టి వేరే వాళ్లకన్నా ఎక్కువసేపు ఈ పని చేయగలిగేది. సాధారణంగా, ఆమె ఆ పనివల్ల వచ్చిన డబ్బంతటినీ తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించేది. కానీ ఇప్పుడు ఆ సిస్టర్‌ ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం పనిచేస్తుంది. అదేంటంటే, ఆమె JW లైబ్రరీ యాప్‌ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే ఒక ట్యాబ్‌ కొనుక్కోవాలని అనుకుంది. ఎందుకంటే JW లైబ్రరీలో ఉండే వీడియోలు, ఇతర సమాచారం ప్రీచింగ్‌ ఎక్కువ చేయడానికి, బైబిల్ని చక్కగా అర్థంచేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమెకు తెలుసు.

హుల్దా ఒక నెలన్నర పాటు ప్రతీరోజు ఉదయాన్నే రెండు గంటలు పనిచేసి, ఒక చిన్న ట్రక్కులో సరిపోయేన్ని రాళ్లను పగలగొట్టింది. అలా చివరికి, ఆమె ట్యాబ్‌ కొనుక్కునేంత డబ్బులు వెనకేసుకోగలిగింది.

తన ట్యాబ్‌తో హుల్దా

హుల్దా ఇలా చెప్తుంది: “ఆ పని చేయడంవల్ల నేను బాగా అలసిపోయేదాన్ని, ఒళ్లు నొప్పులు వచ్చేవి. అయినాసరే ఆ కొత్త ట్యాబ్‌ని వాడి ప్రీచింగ్‌ని బాగా చేసినప్పుడు, మీటింగ్స్‌కి చక్కగా సిద్ధపడినప్పుడు ఆ కష్టాన్నంతా మర్చిపోయేదాన్ని.” అంతేకాదు, మహమ్మారి మొదలైన కొత్తలో ఆ ట్యాబ్‌ బాగా ఉపయోగపడిందని హుల్దా చెప్తుంది. ఎందుకంటే అప్పట్లో మీటింగ్స్‌, ప్రీచింగ్‌ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేవి. హుల్దా నాలుగు రాళ్లు వెనకేసుకుని, తన లక్ష్యం చేరుకున్నందుకు ఆమెతోపాటు మనమూ సంతోషిస్తున్నాం!