బైబిలు బోధలు—ఎప్పటికీ తెలివిని ఇస్తాయి
ఇలా ఊహించుకోండి: మీరు ఎన్నో పురాతన వస్తువులు ఉన్న మ్యూజియంకు వెళ్లారు. అక్కడ చాలా కళాకృతులు రంధ్రాలు పడిపోయి, పాడైపోయి, రంగుపోయి లేదా విరిగిపోయి ఉన్నాయి. వాటిల్లో చాలా భాగాలు లేవు. కానీ ఆశ్చర్యంగా ఒక కళాకృతి మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. దాని డిజైన్ కూడా చాలా స్పష్టంగా, పూర్తిగా ఉంది. “ఇది మిగతా వాటికన్నా కొత్తదా” అని మీరు మీ గైడ్ని అడిగారు. అతను “కాదు” అని జవాబు ఇచ్చాడు. “ఇది ఇక్కడున్న అన్నిటిలో చాలా పాతది. అసలు దీన్ని బాగు చేయాల్సిన అవసరం కూడా రాలేదు” అని అతను అన్నాడు. “దీన్ని వాతావరణం వల్ల పాడవకుండా కాపాడారా” అని మీరు మళ్లీ అడిగారు. అందుకు అతను “లేదు, దీనికి తగిలినంత గాలి, వాన దేనికీ తగలలేదు అన్నాడు. చాలామంది దీనిని పాడుచేయడానికి చూశారు” అన్నాడు. అప్పుడు బహుశా “దీనిని దేంతో తయారు చేశారో?” అని మీరు ఆశ్చర్యపోవచ్చు.
ఒక విధంగా బైబిలు ఆ అసాధారణమైన కళాఖండం లాంటిది. ఇది చాలా ప్రాచీన పుస్తకం. ఇప్పుడున్న ఎన్నో గ్రంథాలకన్నా పాతది. పూర్వం ఎప్పుడో రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ ఆ పాడైపోయిన కళాఖండాల్లా అవి కూడా కాలం గడిచే కొద్దీ బాగా పాడు అయ్యాయి. ఉదాహరణకు సైన్స్ గురించి వాటిలో ఉన్న విషయాలు, కొత్తగా తెలుసుకున్న విషయాల వల్ల, రుజువు అయిన వాస్తవాల వల్ల తప్పుగా నిరూపించబడ్డాయి. వాటిలో ఉన్న వైద్య సలహాలు సహాయ పడే బదులు ఎక్కువ ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి. ఈ ప్రాచీన గ్రంథాలకు ఒకప్పుడున్న వాటిలో ముక్కలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. కొన్ని భాగాలు పూర్తిగా పాడయ్యాయి లేదా పోయాయి.
కానీ బైబిలు వాటన్నిటికన్నా వేరుగా ఉంది. బైబిల్ని రాయడం మొదలు పెట్టి 35 శతాబ్దాలు అయినా బైబిలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. శతాబ్దాలుగా దీని పైన మళ్లీమళ్లీ ఎన్నో దాడులు జరిగాయి. బైబిల్ని కాల్చేశారు, నిషేధించారు, తక్కువ చేశారు, అందులో ఉన్న అంశాలు ప్రతి విధమైన దాడికి గురి అయ్యాయి. కొత్తగా తెలుసుకున్న విషయాల వల్ల అవి పనికిరాకుండా పోలేదు కానీ బైబిల్ చెప్తున్నట్లు అందులో ఉన్న విషయాలన్నీ అద్భుతమైన ముందుచూపుతో రాయబడ్డాయి.—“పాతబడిపోయిందా లేదా భవిష్యత్తులో ఉపయోగపడేలా ఉందా?” అనే బాక్సు చూడండి.
ఈరోజుల్లో కావాల్సిన విలువలు
‘బైబిలు బోధలు మన ఆధునిక కాలానికి సరిపోతాయా?’ అని మీరు అనుకోవచ్చు. జవాబు తెలుసుకోవడానికి దీని గురించి ఆలోచించండి: ‘మానవ జాతి నేడు అనుభవిస్తున్న భయంకరమైన సమస్యలు ఏంటి? వాటిలో మీకు ఏది ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది?’ బహుశా మీకు యుద్ధాలు, కాలుష్యం, నేరాలు, అవినీతి గుర్తుకు రావచ్చు. ఇప్పుడు బైబిలు నేర్పిస్తున్న కొన్ని సూత్రాలు చూడండి. వాటిని చూస్తున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి, ‘మనుషులు ఈ విలువల్ని బట్టి జీవిస్తే ప్రపంచం బాగుంటుందా లేదా?’
శాంతిని ప్రేమించాలి
“శాంతిని నెలకొల్పేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుని పిల్లలు అనబడతారు.” (మత్తయి 5:9) “సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.”—రోమీయులు 12:18.
కనికరం, క్షమాపణ
“కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లమీద ఇతరులు కరుణ చూపిస్తారు.” (మత్తయి 5:7) “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి. యెహోవా a మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.”—కొలొస్సయులు 3:13.
అన్ని జాతుల మధ్య సామరస్యం
“భూమంతటి మీద జీవించడానికి” దేవుడు “ఒకే ఒక్క మనిషి నుండి అన్ని దేశాల మనుషుల్ని చేశాడు.” (అపొస్తలుల కార్యాలు 17:26) ‘దేవునికి పక్షపాతం లేదు,’ “ ప్రతీ దేశంలో, దేవునికి భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 10:34, 35.
భూ సంరక్షణ
“దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.” (ఆదికాండము 2:15) భూమిని నాశనం చేస్తున్న వాళ్లను దేవుడు నాశనం చేస్తాడు.—ప్రకటన 11:18.
దురాశను, నీతి లేకుండా జీవించడాన్ని అసహ్యించుకోవాలి
“ఏ రకమైన అత్యాశకూ చోటివ్వకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే, ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.” (లూకా 12:15) “లైంగిక పాపాలు, అన్నిరకాల అపవిత్రత, అత్యాశ వీటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి, ఎందుకంటే ఇది పవిత్రులకు తగదు.”—ఎఫెసీయులు 5:3.
నిజాయితీ, కష్టపడి పనిచేయడం
“మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం.” (హెబ్రీయులు 13:18) “దొంగతనం చేసేవాళ్లు ఇకనుంచి దొంగతనం చేయకూడదు; వాళ్లు కష్టపడి పనిచేయాలి.”—ఎఫెసీయులు 4:28.
అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం చాలా ముఖ్యం
“కృంగినవాళ్లతో ప్రోత్సాహకరంగా మాట్లాడమని, బలహీనులకు మద్దతివ్వమని, అందరితో ఓర్పుగా వ్యవహరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాం.” (1 థెస్సలొనీకయులు 5:14) కష్టాల్లో ఉన్న అనాథలను, విధవరాళ్లను ఆదుకోండి.—యాకోబు 1:27.
బైబిలు ఈ విలువలను కేవలం చెప్పడం లేదు. అలాంటి సూత్రాలను ఎలా గౌరవించాలో, మన రోజువారీ జీవితంలో ఎలా పాటించాలో కూడా అనువైన విధంగా నేర్పిస్తుంది. ఇప్పుడు మనం చూసిన ఈ నియమాలను ఎక్కువమంది పాటిస్తే, ప్రపంచంలో ఉన్న పెద్దపెద్ద సమస్యలు చాలావరకు తగ్గిపోవా? మరి అలా అయితే బైబిలు సూత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ ఉపయోగపడతాయి, సరిపోతాయి. బైబిలు చెప్తున్న విషయాలు ఇప్పుడు మనకు ఎలా సహాయం చేస్తాయి?
బైబిలు చెప్తున్న విషయాలు ఇప్పుడు మనకు ఎలా ప్రయోజనకరంగా ఉంటాయి?
మనుషులందరిలో తెలివైన ఒకతను ఇలా అన్నాడు: వచ్చే ఫలితాలను బట్టే తెలివి బయటపడుతుంది. (మత్తయి 11:19) మీరు దాన్ని ఒప్పుకుంటారా? తెలివికి నిజమైన పరీక్ష దాన్ని పాటించి, ఎలా పనిచేస్తుందో చూసినప్పుడే. కాబట్టి మీరిలా అనవచ్చు: ‘బైబిలు నిజంగా ప్రయోజనకరం అయితే, అది నా జీవితంలో మంచి ఫలితాలు తీసుకురావాలి కదా? నేను ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యల్లో నాకు ఉపయోగపడాలి కదా?’ ఈ ఉదాహరణ చూడండి.
దియా b అనే ఆమె జీవితం చాలా బిజీగా, సంతృప్తిగా సాగుతోంది. కానీ ఉన్నట్టుండి ఆమె ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో పోగొట్టుకుంది. టీనేజ్లో ఉన్న ఆమె కూతురు చనిపోయింది. ఆమె భర్త, ఆమె విడిపోయారు. ఆర్థికంగా బాగా దెబ్బతింది. ఆమె ఇలా గుర్తు చేసుకుంటుంది: “నేను ఎవరు అనేదే నాకు తెలీకుండా అయిపోయింది—నా కూతురు లేదు, భర్త లేడు, ఇల్లు లేదు. నాకంటూ ఏమీ లేదు. నా పేరు, నా శక్తి, నా భవిష్యత్తు ఏమీ లేనట్టు అనిపించింది.”
ఈ మాటల సత్యాన్ని దియా ఇంత స్పష్టంగా ఎప్పుడూ చూడలేదు: మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు. ఎక్కువ బలముంటే ఎనబై సంవత్సరాలు. అయినా అవి సమస్యలతో దుఃఖంతో నిండి ఉంటాయి. అవి త్వరగా గతించిపోతాయి, మేము ఎగిరిపోతాము.—కీర్తన 90:10.
దియా అలాంటి కష్ట సమయంలో బైబిల్ సహాయం తీసుకుంది. దానివల్ల ఆమె పొందిన సహాయం అసాధారణం. తర్వాత వచ్చే 1 థెస్సలొనీకయులు 2:13.
మూడు ఆర్టికల్స్ చూపిస్తున్నట్లు చాలామంది జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు బైబిల్లో విషయాలను పాటించి, అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు గమనించారు. బైబిలు ఈ ఆర్టికల్ మొదట్లో చూసిన కళాఖండం లాంటిదని వాళ్లు అర్థం చేసుకున్నారు. పాతబడిపోయి పనికిరాకుండా పోయే చాలా పుస్తకాల్లాంటిది కాదు బైబిలు. ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందులో మనుషుల ఆలోచనలు కాదు గానీ దేవుని ఆలోచనలు ఉండబట్టే బైబిలు ప్రత్యేకంగా ఉందా?—బహుశా మీరు కూడా జీవితం చాలా చిన్నదని, ఎన్నో సమస్యలతో ఉన్నదని తెలుసుకుని ఉంటారు. సమస్యలు మిమ్మల్ని ముంచేసినప్పుడు మీరు ఓదార్పు కోసం, మద్దతు కోసం, నమ్మకమైన సలహా కోసం ఎక్కడ చూస్తారు?
బైబిలు మీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మూడు ముఖ్యమైన విషయాలు చూద్దాం. బైబిలు మీకు ఏమి నేర్పిస్తుంది
-
సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా చేసుకోవడం
-
సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం
-
మీరు మార్చలేని విషయాలను తట్టుకుని ముందుకు వెళ్లడం
తర్వాత వచ్చే ఆర్టికల్స్ ఈ మూడు విషయాల్లో సహాయం చేస్తాయి.
a దేవుని పేరు యెహోవా అని బైబిల్లో ఉంది.—కీర్తన 83:18.
b ఈ ఆర్టికల్లో తర్వాత మూడు ఆర్టికళ్లలో కొన్ని అసలు పేర్లు కావు.