సృష్టికర్త ప్రేమతో ఇవ్వబోయే దీవెనల్ని తెలియజేశాడు
మానవ చరిత్ర ఆరంభం నుండి సృష్టికర్త దేవదూతల ద్వారా, ప్రవక్తలు-ప్రవక్త్రిల ద్వారా ప్రజలకు తన సందేశాల్ని తెలియజేశాడు. దాంతోపాటు తన సందేశాన్ని, తాను ఇస్తానని మాటిచ్చిన దీవెనల్ని రాయించాడు. ఆ దీవెనలు మన భవిష్యత్తుకు సంబంధించినవి. ఇప్పుడు వాటిని ఎక్కడ కనుగొనవచ్చు?
దేవుడు మనుషులకు ఇచ్చిన సందేశం పవిత్ర లేఖనాల్లో ఉంది. (2 తిమోతి 3:16) ఆ సందేశాన్ని రాయించడానికి ఆయన ప్రవక్తల్ని ఎలా ఉపయోగించుకున్నాడు? (2 పేతురు 1:21) దేవుడు తన ఆలోచనల్ని ఆ రచయితల మనసుల్లో ఉంచాడు, వాళ్లు వాటిని రాశారు. ఉదాహరణకు ఒక యజమాని తన సెక్రటరీతో ఒక ఉత్తరం రాయించాడు అనుకుందాం. దాన్ని రాసింది సెక్రటరీ అయినప్పటికీ, అందులోని మాటలన్నీ యజమానివే అని మనం అర్థం చేసుకుంటాం. అదేవిధంగా, దేవుడు పవిత్ర లేఖనాల్ని మనుషులతో రాయించినప్పటికీ, అందులోని మాటలన్నీ దేవునివే.
దేవుని సందేశం చాలా భాషల్లో ఉంది
తన సందేశం చాలా ముఖ్యమైంది కాబట్టి ప్రజలందరూ దాన్ని చదవాలని, అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేడు, ఆయన చెప్తున్న “శాశ్వతకాల మంచివార్త” “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు” చెందిన ప్రజలకు అందుబాటులో ఉంది. (ప్రకటన 14:6, అధస్సూచి) దేవుని ఆశీర్వాదం వల్ల పవిత్ర లేఖనాల్లోని అన్ని పుస్తకాలు లేదా వాటిలోని కొన్ని పుస్తకాలు 3,000 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర పుస్తకం ఇన్ని భాషల్లో లేదు.