కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవం మీద గౌరవం ఏమైపోయింది?

జీవం మీద గౌరవం ఏమైపోయింది?

జీవం మీద గౌరవం ఎందుకు చూపించాలి?

జీవం మీద గౌరవంలేని అలవాట్లు, పనులు మీ ప్రాణాల్ని, ఇతరుల ప్రాణాల్ని రిస్కులో పెడతాయి.

  • పొగ తాగడం క్యాన్సర్‌కు కారణం. అది మన రోగనిరోధక శక్తిని (Immunity) తగ్గించేస్తుంది. 90శాతం మంది లంగ్‌ క్యాన్సర్‌తో చనిపోవడానికి కారణం పొగతాగడం లేదా ఆ పొగను పీల్చడం.

  • ప్రతీ సంవత్సరం కాల్పుల మోతవల్ల ఎంతోమంది మానసికంగా గాయపడుతున్నారు. స్టాన్ఫోర్డ్‌ యూనివర్సిటీ రిపోర్టు ఏం చెప్తుందంటే: “ఒక రీసర్చ్‌ ప్రకారం స్కూల్లో జరిగిన కాల్పుల నుండి తప్పించుకున్న వాళ్లకు కంటికి కనిపించే గాయాలు అవ్వకపోయినా, కంటికి కనిపించని భయాలు, టెన్షన్లు వాళ్లను కొన్ని సంవత్సరాలపాటు వెంటాడాయి.”

  • మద్యం తాగి, డ్రగ్స్‌ తీసుకుని ఆ మత్తులో తూలుతూ బండిని నడిపితే రోడ్డుమీద వెళ్లే వాళ్లకే కాదు, దారిపక్కన నడిచే వాళ్లకు కూడా ప్రమాదమే. జీవానికి విలువ ఇవ్వకపోతే అమాయకులు బలౌతారు.

మీరు ఏం చేస్తే బాగుంటుంది

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొగతాగడం, మద్యానికి బానిసవ్వడం, డ్రగ్స్‌ తీసుకోవడం లాంటి అలవాట్లను ఇప్పటికైనా ఆపేయవచ్చు. ఆ అలవాట్లు ఉంటే మీ ప్రాణాల్ని, ఇతరుల ప్రాణాల్ని, చివరికి మిమ్మల్ని ప్రేమించేవాళ్ల ప్రాణాల్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తారు.

“శరీరానికి, ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.”—2 కొరింథీయులు 7:1.

జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు జరగకుండా మీ ఇంటిని, మీ బండిని మంచి కండిషన్‌లో ఉంచుకోండి. జాగ్రత్తగా డ్రైవ్‌ చేయండి, మీ ప్రాణం మీదికి తీసుకొచ్చే సాహసాలు చేయమని ఎవరైనా మీకు చెప్తే వినకండి.

“నువ్వు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎవరైనా దాని మీద నుండి కిందపడి నీ ఇంటిమీదికి రక్తాపరాధం రాకుండా ఉండేలా నీ ఇంటి పైకప్పుకు పిట్టగోడ కట్టాలి.”—ద్వితీయోపదేశకాండం 22:8. a

దయ చూపించండి. జీవం మీద గౌరవం ఉంటే దేశం, జాతి, కులం, మతం, చదువు, ఆస్తి-అంతస్తు లాంటి తేడాలు చూడం, అందరితో దయగా ఉంటాం. ఎందుకంటే ఇలాంటి తేడాలు, ద్వేషాలే హింసకు-రక్తపాతానికి ఊపిరి పోస్తున్నాయి.

“మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి. బదులుగా ఒకరితో ఒకరు దయగా మెలగండి.”—ఎఫెసీయులు 4:31, 32.

యెహోవాసాక్షులమైన మేము ఏం చేస్తామంటే . . .

ఆరోగ్యంగా జీవించమని ప్రోత్సహిస్తాం. ప్రజలకు మేము చెప్పే బైబిలు విషయాలు చెడు వ్యసనాల్ని, హానికరమైన అలవాట్లను వదిలేసుకోవడానికి సహాయం చేస్తాయి.

మా నిర్మాణ ప్రాజెక్టుల్లో భద్రతకు పెద్దపీట వేస్తాం. మీటింగ్స్‌ కోసం, బైబిలు గురించి నేర్చుకోవడం కోసం మేము కలుసుకునే బిల్డింగ్‌లు వాలంటీర్ల సహాయంతో కడతాం. వాళ్లకు ఏ ప్రమాదం జరగకుండా సురక్షితంగా ఉండేలా ముందే శిక్షణ ఇస్తాం. అంతేకాదు, స్థానిక భద్రతా నియమాలకు తగ్గట్టు మా బిల్డింగులు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటాం.

విపత్తులు వచ్చినప్పుడు మానవత్వం చూపిస్తాం. గత ఏడాది దాదాపు 200 విపత్తులతో ప్రపంచం గడగడలాడింది. అప్పుడు బాధితులకు ఆర్థిక సహాయం చేయడానికి ఇంచుమించు 12 మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టాం.

2014వ సంవత్సరం వెస్ట్‌ ఆఫ్రికాలో, 2018వ సంవత్సరం డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఎబోలా వైరస్‌ కలకలం రేపింది. ఆ ప్రాణాంతక వ్యాధి మరింత సోకకుండా, దాన్ని ఎలా అరికట్టవచ్చో అక్కడున్న ప్రజలకు నేర్పించాం. మా ప్రతినిధులు కొంతమంది వెళ్లి “విధేయత మీ జీవితాలను కాపాడుతుంది” అనే దాని గురించి మాట్లాడారు. ఆరాధన కోసం మేము కలుసుకునే చోట్ల చేతులు కడుక్కునే ఏర్పాట్లు చేశాం. అలాగే చేతులు కడుక్కోవడం, ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో మరీమరీ చెప్పాం.

ఎబోలా వైరస్‌ ఎక్కువ సోకకుండా సాక్షులకు, సాక్షులుకాని వాళ్లకు సహాయం చేసినందుకు సియర్రా లియోన్‌లో యెహోవాసాక్షులను మెచ్చుకుంటూ ఒక రేడియో అనౌన్స్‌మెంట్‌ చేశారు.

2014వ సంవత్సరం లైబీరియాలో ఎబోలా వైరస్‌ కలకలం రేపినప్పుడు, రాజ్యమందిరం దగ్గర చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేశారు.

a అప్పట్లో మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో ఉన్నవాళ్లు ఈ తెలివైన సలహాను పాటించడం వల్ల తమ కుటుంబ సభ్యులు, ఇతరులు సురక్షితంగా ఉండేలా చూసుకున్నారు.