కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిల్ఫోర్డ్‌ సౌండ్‌

ప్రాంతాలు, ప్రజలు

న్యూజిలాండ్‌ దేశాన్ని చూసి వద్దాం

న్యూజిలాండ్‌ దేశాన్ని చూసి వద్దాం

బహుశా ఒక 800 సంవత్సరాల క్రితం కావచ్చు మౌరీ జాతులు సముద్రంలో వేల కీలోమీటర్లు ప్రయాణించి వచ్చి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. అక్కడ వాళ్లు పొలినేషియాలో వదిలి వచ్చిన ఉష్ణమండల ద్వీపాలకు వేరుగా ఉన్న భూభాగాన్ని కనిపెట్టారు. ఇది కొండలతో, మంచు పర్వతాలతో, వేడినీటి కొలనులతో, మంచుతో నిండిన ప్రాంతం. ఐదు శతాబ్దాల తర్వాత మరో జాతి ప్రజలు కూడా అక్కడికి వలస వచ్చారు. ఎంతో దూరంలో ఉన్న యూరప్‌ నుండి వాళ్లు వచ్చారు. ఇప్పుడు చాలామంది న్యూజిలాండ్‌ వాసులు ఆంగ్లో-శాక్సన్‌, పొలినేషియా వంశాల సంస్కృతిని పాటిస్తుంటారు. దాదాపు 90 శాతం జనాభా నగరాల్లో నివసిస్తున్నారు. వెల్లింగ్టన్‌ నగరానికి ప్రపంచ దక్షిణ రాజధానిగా పేరు ఉంది.

నార్త్‌ ఐలాండ్‌లో ఆవిరి ఉబుకుతున్న బురద కొలనులు

ప్రపంచంలో ఈ ప్రాంతం ఎక్కడో ఉంది, అయినా ఈ ప్రాంతానికున్న వైవిధ్యమైన, అద్భుతమైన అందాన్ని బట్టి న్యూజిలాండ్‌కి ప్రతి సంవత్సరం 30 లక్షల వరకు పర్యాటకులు వస్తుంటారు.

సిల్వర్‌ ట్రీ ఫెర్న్‌ దాదాపు 30 అడుగుల (10 మీ.) పొడవు పెరగగలదు

ఎగరలేని టకాహి పక్షి అంతరించిపోయిందని 1948 వరకు అనుకున్నారు

న్యూజిలాండ్‌లో విచిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఎగరలేని పక్షుల జాతులు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. పాకే జంతువుల జాతికి చెందిన బల్లి లాంటి టువటార అనే జీవిని ఇక్కడ చూడవచ్చు. అది దాదాపు 100 సంవత్సరాల వరకు జీవిస్తుంది. గబ్బిలాలు, సముద్రంలో జీవించే పెద్ద తిమింగళాలు, ఢాల్ఫిన్లు ఈ దేశంలో ఉండే పాలిచ్చే జంతువులు.

యెహోవాసాక్షులు న్యూజిలాండ్‌లో దాదాపు 120 సంవత్సరాలు నుండి ఉన్నారు. వాళ్లు ఎంతో ఉత్సాహంగా బైబిల్ని నేర్పిస్తున్నారు. న్యూయి, రారొటోంగన్‌, సమోవన్‌, టోంగాన్‌ లాంటి పొలినేషియా భాషలతో పాటు కనీసం 19 భాషల్లో వాళ్లు బైబిల్‌ విషయాలు నేర్పిస్తున్నారు.

సాంస్కృతిక వస్త్రాలు వేసుకుని డాన్స్‌ చేస్తున్న మౌరీలు