కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేడాలు చూపించకుండా సహనం చూపించండి

తేడాలు చూపించకుండా సహనం చూపించండి

తేడాలు చూపించకుండా సహనం చూపించండి

అందర్నీ కలుపుకుపోవడం, క్షమించడం, సహించడం వంటి లక్షణాలు స్నేహాల్ని, బంధాల్ని బలపరుస్తాయి. కానీ ఎంతవరకు సహించాలి?

అందర్నీ సమానంగా చూడడానికి ఏమి సహాయం చేస్తుంది?

ప్రస్తుతం ఈ లోకంలో . . .

నా జాతి, దేశం, తెగ, మతం మాత్రమే గొప్పవి అనే భావాలు ఎక్కువైపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య ద్వేషం బాగా పెరిగిపోయింది.

దేవుడు ఏమంటున్నాడు . . .

యేసుక్రీస్తు భూమ్మీద ఉన్న కాలంలో మనుషుల మధ్య తేడాలు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా యూదులు, సమరయులు ఒకరినొకరు ద్వేషించుకునేవాళ్లు. (యోహాను 4:9) స్త్రీలను చిన్నచూపు చూసేవాళ్లు. అంతేకాకుండా యూదా మతనాయకులు సామాన్య ప్రజలను హీనంగా చూసేవాళ్లు. (యోహాను 7:49) కానీ, యేసు మాత్రం వాళ్లలా ఉండలేదు. ఆయన్ని వ్యతిరేకించేవాళ్లు “ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని” అన్నారు. (లూకా 15:2) యేసు దయ, ఓర్పు, సహనం చూపించాడు. ఎందుకంటే ప్రజలు దేవునికి దగ్గరయ్యేలా సహాయం చేయడానికే ఆయన వచ్చాడు కానీ వాళ్లకు తీర్పు తీర్చడానికి కాదు. ఆయన ప్రతీది ప్రేమతోనే చేశాడు.—యోహాను 3:17; 13:34.

యేసు అందర్నీ సమానంగా ప్రేమించాడు. ఆయన ఈ భూమ్మీదకు వచ్చింది ప్రజలను దేవునికి దగ్గర చేసేందుకే కానీ తీర్పుతీర్చడానికి కాదు

అందర్నీ సమానంగా చూస్తూ సహనం చూపించడానికి ప్రేమ సహాయం చేస్తుంది. ప్రేమ ఉంటే ఇతరుల్లో లోపాలున్నా మనం వాళ్లతో హృదయపూర్వకంగా స్నేహం చేస్తాం. కొలొస్సయులు 3:13 ఇలా చెప్తుంది: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”

“ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.”1 పేతురు 4:8.

ప్రతీది సహించాల్సిన అవసరముందా?

లోకంలో ఇలా ఉంది . . .

చాలా దేశాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతీఒక్కరు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా కొన్ని హద్దులు పెట్టారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

[ప్రేమ] అమర్యాదగా నడువదు.” (1 కొరింథీయులు 13:5) యేసుక్రీస్తు అందరితో సహనంగా ఉన్నా మర్యాదలేని ప్రవర్తనను, కపటాన్ని, వేరే ఏ చెడు ప్రవర్తనను సహించలేదు. ఆయన వాటన్నిటిని ధైర్యంగా ఖండించాడు. (మత్తయి 23:13) “దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును” అని ఆయన చెప్పాడు.—యోహాను 3:20.

క్రైస్తవ అపొస్తలుడైన పౌలు “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి” అని చెప్పాడు. (రోమీయులు 12:9) అలా చెప్పినవాటిని పాటించాడు కూడా. ఉదాహరణకు, ఆయన కాలంలో కొంతమంది యూదా క్రైస్తవులు, యూదులుకాని ఇతర క్రైస్తవులకు దూరంగా ఉండేవాళ్లు. కానీ యూదా క్రైస్తవుడైన పౌలు మాత్రం అలా దూరంగా లేడు. ఆయన వాళ్లను ప్రేమపూర్వకంగా, ధైర్యంగా సరిదిద్దాడు. (గలతీయులు 2:11-14) “దేవుడు పక్షపాతి కాడని,” తన ప్రజల మధ్య తేడాలు ఉండడం దేవునికి నచ్చదని పౌలుకు తెలుసు.—అపొస్తలుల కార్యములు 10:34.

క్రైస్తవులుగా యెహోవాసాక్షులు మంచి చెడుల విషయంలో బైబిలు చెప్తున్నదాన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటారు. (యెషయా 33:22) అందుకే చెడ్డ పనులు చేసేవాళ్లను వాళ్ల మధ్య ఉండనివ్వరు. క్రైస్తవ సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని నియమాలను, సూత్రాలను పాటించని వాళ్లను సంఘంలో ఉంచకూడదు. కాబట్టి యెహోవాసాక్షులు, “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి” అనే దేవుని ఆజ్ఞను పాటిస్తారు.—1 కొరింథీయులు 5:11-13.

“యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.”కీర్తన 97:10.

దేవుడు చెడుతనాన్ని ఎప్పటికీ సహిస్తూ ఉంటాడా?

అందరూ ఏమంటున్నారు . . .

మనుషుల్లో చెడుతనం సహజంగానే ఉంటుంది కాబట్టి చెడును ఎప్పటికీ తీసివేయలేము.

దేవుడు ఏమంటున్నాడు . . .

హబక్కూకు ప్రవక్త యెహోవా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.” (హబక్కూకు 1:3) అలా దిగులు పడుతున్న అతనికి చెడ్డవాళ్లను ఖచ్చితంగా శిక్షిస్తాను, ఆ మాట “తప్పక జరుగును,” అది “జాగుచేయక వచ్చును” అని యెహోవా అభయమిచ్చాడు.—హబక్కూకు 2:3.

ఈలోగా చెడ్డవాళ్లకు మారే అవకాశం ఉంది. “దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.” (యెహెజ్కేలు 18:23) చెడ్డ పనులు మానుకుని యెహోవాను ఆరాధించడానికి ప్రయత్నించే వాళ్లు భవిష్యత్తు విషయంలో ఏ భయం లేకుండా ఉండవచ్చు. “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.”—సామెతలు 1:33. ◼ (g15-E 08)

“ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”కీర్తన 37:10, 11.