హార్‌మెగిద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుంది?
హార్‌మెగిద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుంది?
‘నేను చూసినప్పుడు, ఇదిగో! ప్రతీ జనములోనుండి, ప్రతీ వంశంలోనుండి, ప్రజలలోనుండి, ఆయా భాషలు మాట్లాడేవాళ్లలోనుండి వచ్చిన ఎవరూ లెక్కించలేని ఒక గొప్పసమూహం కనబడింది. వీళ్లు మహాశ్రమల నుండి వచ్చినవాళ్లు.’—ప్రకటన 7:9, 14.
హార్‌మెగిద్దోను యుద్ధానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. అలా అని ఎందుకు చెప్పవచ్చు?
ఎందుకంటే, యెహోవాను ఆరాధిస్తూ బైబిల్లోని ఉన్నత నైతిక ప్రమాణాలను పాటిస్తున్న వాళ్లు ఇప్పటికే ప్రపంచమంతటా ఉన్నారు. దేవుని నిర్దేశంలో, అన్ని దేశాలకు, తెగలకు చెందిన, ఆయా భాషలు మాట్లాడే లక్షలాదిమంది సోదర భావంతో ఏకమౌతున్నారు. అది యెహోవాసాక్షుల మధ్య కనిపిస్తుంది.—యోహాను 13:35.
నిస్సహాయులుగా కనిపించే ఆ శాంతికాముకుల మీద అత్యంత గొప్ప దాడి చేయడానికి త్వరలోనే సాతాను తన సైన్యాలను పోగుచేస్తాడు. (యెహెజ్కేలు 38:8-12; ప్రకటన 16:13-16) అది తప్పకుండా జరుగుతుందని మనకెలా తెలుసు? హార్‌మెగిద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి సహాయం చేసే కొన్ని ప్రత్యేకమైన సంఘటనల గురించి బైబిలు చెబుతోంది. వాటిలో చాలా సంఘటనలు ఇప్పటికే జరుగుతున్నాయి.
ఇప్పటికే జరుగుతున్న సంఘటనలు
“లోకాంతము” ఎప్పుడు వస్తుందో ఎలా తెలుసుకోవచ్చని యేసు శిష్యులు ఆయనను అడిగారు. (మత్తయి 24:3, కతోలిక అనువాదము) దానికి జవాబుగా యేసు, ‘జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యం లేస్తూ అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలిగే’ కాలం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆయన, ‘ఇవన్నీ వేదనలకు ప్రారంభం’ అని అన్నాడు. (మత్తయి 24:7, 8) ఆ కాలాన్నే అపొస్తలుడైన పౌలు “అంత్యదినములు” అన్నాడు, అవి ‘అపాయకరంగా’ ఉంటాయని చెప్పాడు. (2 తిమోతి 3:1) ఆ ప్రవచనాలు చెబుతున్న సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయని మీకు అనిపిస్తోందా?
ఆ కాలంలో ఎందుకన్ని కష్టాలు ఉంటాయి? ఎందుకో అపొస్తలుడైన యోహాను చెప్పాడు. సాతాను, అతడి దయ్యాలు కొంతకాలం భూపరిధిలోనే ఉంటారని, ప్రకటన 12:7-12) నేడు ప్రపంచమంతటా ప్రజల్లో కోపం, క్రూరత్వం ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించారా?
ఆ సమయంలో సాతాను ‘బహు క్రోధంతో’ ఉంటాడని ఆయన చెప్పాడు. (కష్టాలతో నిండిన ఈ కాలాల్లో ఒక అసాధారణమైన పని జరుగుతుందని కూడా యేసు చెప్పాడు. దాని గురించి ఆయనిలా అన్నాడు: ‘[దేవుని] రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.’ (మత్తయి 24:14) నేడు యెహోవాసాక్షులు, 235 కన్నా ఎక్కువ దేశాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు, 500 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురణలు ముద్రిస్తున్నారు. వాళ్లు ప్రచురిస్తున్న కావలికోట, తేజరిల్లు! (ఆంగ్లంలో అవేక్!) a అనే బైబిలు సంబంధిత పత్రికలను, ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా అందిస్తున్నారు. అంతేకాదు వాళ్లు బైబిలును దాదాపు 100 భాషల్లోకి అనువదించారు. ఆ పనిని స్వచ్ఛంద సేవకులే చేస్తారు. స్వచ్ఛంద విరాళాల సహాయంతో అది జరుగుతుంది. ప్రకటనా పని ఈ స్థాయిలో జరగడం చూసినప్పుడు, యేసు చెప్పిన ప్రవచనం నెరవేరుతోందని అనిపించడం లేదా?
యెహోవా దేవునికి, ఆయన శత్రువులకు మధ్య యుద్ధానికి దారితీసే సంఘటనల గురించి కూడా బైబిలు చెబుతోంది. త్వరలో నెరవేరే అలాంటి మూడు ప్రవచనాలను ఇప్పుడు చూద్దాం.
త్వరలో జరిగే సంఘటనలు
మొదటి ప్రవచనం. దేశాలు, ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు’ అనే ముఖ్యమైన ప్రకటన చేస్తాయని బైబిలు చెబుతోంది. ఎందుకంటే అవి, పెద్దపెద్ద సమస్యలను అతి త్వరలోనే పూర్తిగా పరిష్కరించగలమని అనుకుంటాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది, అసలు శాంతి అనేదే ఉండదు.—1 థెస్సలొనీకయులు 5:1-3.
రెండవ ప్రవచనం. తర్వాత, అనేక ప్రభుత్వాలు ప్రపంచంలోని మత సంస్థలకు వ్యతిరేకంగా తిరుగుతాయి. బైబిలు ఆ ప్రభుత్వాలను క్రూరమృగంతోనూ, ప్రపంచంలోని మతాలను ఆ మృగం మీద స్వారీ చేసే స్త్రీతోనూ పోలుస్తోంది. (ప్రకటన 17:3, 15-18) దేవుని ఆజ్ఞలు పాటించకుండానే ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే మతాలను ఆ మృగం నాశనం చేస్తుంది, అలా తెలియకుండానే అది దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.
ఆ సంఘటనను అపొస్తలుడైన యోహాను ఇలా వర్ణిస్తున్నాడు: ‘నువ్వు పది కొమ్ములున్న ఆ మృగాన్ని చూశావు కదా, వాళ్లు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేనిదానిగా, దిగంబరిగా చేసి దాని మాంసాన్ని భక్షించి, అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చేస్తారు. తన సంకల్పం కొనసాగించేలా దేవుడే వాళ్లకు బుద్ధి పుట్టించాడు.’—ప్రకటన 17:16, 17.
మూడవ ప్రవచనం. అలా ప్రపంచంలోని మతాల మీద దాడి జరిగిన తర్వాత, యెహోవా ఆరాధకుల మీద దాడిచేసేందుకు ప్రభుత్వాలను, సైన్యాలను సాతాను సమకూరుస్తాడు.—ప్రకటన 7:14; మత్తయి 24:21.
మీరేమి చేయాలి?
మీరు బైబిలును నిశితంగా అధ్యయనం చేసే అవకాశం ఇప్పటివరకూ మీకు దొరికివుండకపోతే ఆ సంఘటనలు జరుగుతాయని నమ్మడం మీకు కష్టమనిపించవచ్చు. అయితే అవన్నీ అతి త్వరలోనే పూర్తిగా నెరవేరతాయని మనం నమ్మవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే బైబిల్లోని ఎన్నో ప్రవచనాలు నెరవేరాయి. b వాటిని పరిశీలిస్తే, మిగతావి కూడా నెరవేరుతాయనే నమ్మకం కలుగుతుంది.
“సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” దగ్గర్లో ఉందని యెహోవాసాక్షులు ఎందుకు నమ్ముతారో, దాని గురించి భయపడాల్సిన అవసరం ఎందుకు లేదో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ యుద్ధంలో యెహోవా మిమ్మల్ని కూడా కాపాడాలంటే మీరేమి చేయాలో బైబిలు చెబుతోంది. దాని గురించి వివరించమని మీరు వాళ్లను అడగండి. (ప్రకటన 16:14) వాళ్లు చెప్పింది విన్న తర్వాత, భవిష్యత్తు గురించిన మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. (w12-E 02/01)
[అధస్సూచీలు]
a ఈ ప్రచురణ ప్రస్తుతం తెలుగులో లేదు.
b నెరవేరిన కొన్ని బైబిలు ప్రవచనాల కోసం, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 2, 9 అధ్యాయాలను చూడండి. ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.
[8వ పేజీలోని బ్లర్బ్]
యెహోవాసాక్షులు చేస్తున్న పనిని చూస్తే బైబిలు ప్రవచనం నెరవేరుతోందని మీకు అనిపించడం లేదా?