మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం ఎలా నేర్పించవచ్చు?
దేవుడు ఉన్నాడని, వాళ్లను ప్రేమిస్తున్నాడని నమ్మితేనే పిల్లలు దేవున్ని ప్రేమించడం నేర్చుకుంటారు. దేవున్ని ప్రేమించాలంటే పిల్లలు ఆయన గురించి తెలుసుకోవాలి. (1 యోహాను 4:8) ఉదాహరణకు, దేవుడు మనుషుల్ని ఎందుకు చేశాడు? దేవుడు కష్టాలను ఎందుకు తీసేయట్లేదు? భవిష్యత్తులో మనుషుల కోసం దేవుడు ఏమి చేస్తాడు? వంటివి వాళ్లు తెలుసుకోవాలి.—ఫిలిప్పీయులు 1:9-11 చదవండి.
మీ పిల్లలు దేవున్ని ప్రేమించడం నేర్చుకోవాలంటే, మీరు కూడా దేవున్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చూపించాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.—ద్వితీయోపదేశకాండము 6:5-7; సామెతలు 22:6 చదవండి.
మీ పిల్లల హృదయాలను ఎలా చేరుకోవచ్చు?
దేవుని వాక్యానికి చాలా బలం ఉంది. (హెబ్రీయులు 4:12) కాబట్టి అందులోని ప్రాథమిక విషయాలు పిల్లలకు నేర్పించండి. ప్రజల హృదయాలను చేరుకోవడానికి యేసు ప్రశ్నలు అడిగాడు, వాళ్లు చెప్పేది విన్నాడు, దేవుని వాక్యాన్ని వివరించాడు. మీరు కూడా మీ పిల్లల హృదయాలను చేరుకోవడానికి యేసు నేర్పించిన విధానాన్ని పాటించవచ్చు.—లూకా 24:15-19, 27, 32 చదవండి.
అంతేకాకుండా, దేవుడు ప్రజలను ఎలా చూసుకున్నాడో చెప్పే బైబిలు వృత్తాంతాలు కూడా దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమించడానికి పిల్లలకు సహాయం చేస్తాయి. అలా నేర్పించడానికి ఉపయోగపడే ప్రచురణలు www.mr1310.com/te వెబ్సైట్లో ఉన్నాయి.—2 తిమోతి 3:16, 17 చదవండి. (w14-E 12/01)