కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | సృష్టికర్తకు దగ్గరవ్వడం సాధ్యమే!

ఇంతకన్నా మంచి జీవితం లేదు

ఇంతకన్నా మంచి జీవితం లేదు

దేవుని స్నేహితులవడానికి మీరు ఏమి చేయవచ్చు? దేవునితో మంచి స్నేహం పెంచుకోవాలంటే . . .

  1. దేవుని పేరు యెహోవా అని తెలుసుకుని దాన్ని ఉపయోగించాలి.

  2. ప్రతీరోజు ఆయనకు ప్రార్థిస్తూ, ఆయన వాక్యమైన బైబిలును చదువుతూ ఆయనతో మాట్లాడాలి.

  3. యెహోవాకు ఇష్టమైన వాటినే చేస్తూ ఉండాలి.

దేవుని పేరును ఉపయోగిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, బైబిలు చదువుతూ, ఆయనకు ఇష్టమైనవి చేస్తూ దేవుని స్నేహితులవ్వండి

వీటి ప్రకారం, దేవుని స్నేహితులవడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ‘నేను ఇంకా బాగా చేయాలి’ అని దేని గురించైనా మీకనిపిస్తుందా? నిజమే, ఇంకా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కానీ, ఒక్కసారి దానివల్ల వచ్చే ఫలితాలు చూడండి.

అమెరికాలోని జెనిఫర్‌ ఇలా అంది: “దేవుని స్నేహితులవడానికి చేసే ఏ ప్రయత్నమూ వృథా కాదు. ఎన్నో ఆశీర్వాదాలుంటాయి. ఉదాహరణకు, దేవునిపై నమ్మకం పెరుగుతుంది, ఆయనను ఇంకా బాగా అర్థం చేసుకుంటాం, అన్నిటికి మించి ఆయన మీద ప్రేమ ఎక్కువౌతుంది. ఇంతకన్నా మంచి జీవితం లేదు!”

మీకు దేవునితో మంచి స్నేహాన్ని ఆనందించాలనుందా? అందుకు మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. వాళ్లు మీకు ఉచితంగా బైబిలు విషయాలు నేర్పిస్తారు. మీకు దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షుల మందిరానికి రమ్మని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవునితో స్నేహానికి విలువిచ్చే వాళ్లతో కలిసి అక్కడ ఆనందించవచ్చు. a అప్పుడు, మీకు కూడా ఇలా అనిపిస్తుంది: “నాకైతే దేవుని పొందు ధన్యకరము.”—కీర్తన 73:28. (w14-E 12/01)

a బైబిలు అధ్యయనం కోసం లేదా మీకు దగ్గర్లో యెహోవాసాక్షుల రాజ్య మందిరం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ పత్రిక ఇచ్చిన వ్యక్తిని అడగండి లేదా www.mr1310.com/te వెబ్‌సైట్‌ మొదటిపేజీ కింది భాగంలో మమ్మల్ని సంప్రదించండి కింద వెదకండి.