చిన్నారుల కోసం బైబిలు పాఠాలు

తల్లిదండ్రులారా, ఈ కథలతో మీ పిల్లలకు విలువైన బైబిలు పాఠాలు నేర్పించండి.

ముందుమాట

మీ పిల్లల్ని పెంచే విషయంలో ద్వితీయోపదేశకాండములోని మాటలు మీకు మార్గదర్శిగా పనిచేస్తాయి.

పాఠం 1

మనం తెలుసుకోవడానికి ఇష్టపడే ఒక రహస్యం

బైబిలు ఒక ప్రత్యేక రహస్యం గురించి చెప్తోంది, దాన్నే పరిశుద్ధ మర్మం అంటారు. ఆ రహస్యాన్ని దేవుడు చెప్తున్నాడు, అందుకే అది పరిశుద్ధమైనది. మరి మీకు ఆ రహస్యమేంటో తెలుసుకోవాలనుందా?

పాఠం 2

యెహోవాను సంతోషపెట్టాలనుకున్న రిబ్కా

రిబ్కాలా ఉండాలంటే మనం ఏమి చేయాలి? ఈ కథ చదివి, ఆమె గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి.

పాఠం 3

యెహోవా మీద నమ్మకం ఉంచిన రాహాబు

యెరికో నాశనం అయినప్పుడు రాహాబు, ఆమె ఇంట్లో ఉన్నవాళ్లు ఎలా రక్షణ పొందారో తెలుసుకోండి.

పాఠం 4

నాన్నను, యెహోవాను సంతోషపెట్టిన అమ్మాయి

యెఫ్తా కూతురు ఏ మాట నిలబెట్టింది? మనం ఆమెలా ఉండాలంటే ఏమి చేయాలి?

పాఠం 5

ఎప్పుడూ సరైనదే చేసిన సమూయేలు

వేరేవాళ్లు చెడ్డ పనులు చేసినా, మీరు సమూయేలులా ఉంటూ సరైనదే ఎలా చేయవచ్చు?

పాఠం 6

భయపడని దావీదు

దావీదుకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఆసక్తికరమైన ఈ బైబిలు కథ చదవండి.

పాఠం 7

మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?

ఏలీయాకు ఒంటరిగా అనిపించినప్పుడు యెహోవా ఆయనకు ఏమి చెప్పాడు? ఏలీయాకు జరిగిన దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

పాఠం 8

మంచివాళ్లతో స్నేహం చేసిన యోషీయా

యోషీయాకు సరైనది చేయడం చాలా కష్టం అయ్యిందని బైబిలు చెబుతోంది. అతని స్నేహితులు అతనికి ఎలా సహాయం చేశారో తెలుసుకోండి.

పాఠం 9

యెహోవా గురించి మాట్లాడడం మానని యిర్మీయా

కొంతమంది ఎగతాళి చేసినా, ఇంకొంతమంది కోప్పడినా యిర్మీయా దేవుని గురించి మాట్లాడడం ఎందుకు మానేయలేదు?

పాఠం 10

అన్నివేళలా లోబడిన యేసు

అమ్మానాన్నలకు లోబడడం మీకు అన్నిసార్లూ సులువు కాదు. యేసు ఉదాహరణ మీకు ఎలా సాయం చేస్తుందో తెలుసుకోండి.

పాఠం 11

యేసు గురించి రాసిన వ్యక్తులు

యేసు కాలంలో జీవించిన, ఆయన గురించి రాసిన ఎనిమిది మంది గురించి నేర్చుకోండి.

పాఠం 12

ధైర్యం చూపించిన పౌలు మేనల్లుడు

ఈ యువకుడు తన మామయ్య ప్రాణాల్ని కాపాడాడు. ఇంతకీ అతను ఏమి చేశాడు?

పాఠం 13

ప్రజలకు సహాయపడాలనుకున్న తిమోతి

తిమోతి జీవితంలాగే మీ జీవితం కూడా ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోవాలంటే ఏమి చేయాలి?

భూమంతటినీ పరిపాలించబోయే ఓ రాజ్యం

యేసు పరిపాలనలో ఈ భూమి ఎలా ఉంటుంది? మీకు ఆయన పాలన కింద ఉండాలనుందా?