సెక్షన్ 7 • అపొస్తలుల కార్యాలు 18:23–21:17
‘బహిరంగంగా, ఇంటింటా బోధించడం’
మనం ఎందుకు వినయంగా ఉండాలి? ప్రజలకు తగ్గట్టు మాట్లాడే విధానాన్ని ఎందుకు మార్చుకోవాలి? మంచివార్త ప్రకటించడానికి మనం ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి ఏంటి? సొంత ఇష్టాల కన్నా, దేవుని ఇష్టాన్ని చేయడమే మనకు ముఖ్యమని ఎలా చూపించవచ్చు? పౌలు మిషనరీ యాత్రల్లో చివరిదైన మూడో మిషనరీ యాత్రలోని ఆసక్తికరమైన వివరాల్ని పరిశీలిస్తే ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు.