దుఃఖం
ఎవరైనా చనిపోతే దుఃఖించడం తప్పుకాదని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?
ఆది 23:2; 24:67; 37:34, 35; 42:36; యోహా 11:19, 31, 33-36
2స 1:17-27; అపొ 9:36-39 కూడా చూడండి
యెహోవా దుఃఖంలో మునిగిపోయిన వాళ్లకు ఊరటను ఇవ్వాలనుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?
చనిపోయిన తర్వాత ఏమౌతుందో తెలుసుకోవడం ఎందుకు ఓదార్పునిస్తుంది?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
లూకా 20:37, 38—పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని వివరిస్తూ చనిపోయిన వాళ్లు దేవుని దృష్టిలో ఇంకా బ్రతికే ఉన్నారని యేసు చెప్పాడు
-
యోహా 11:5, 6, 11-14—తన ప్రియ స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు మరణాన్ని యేసు నిద్రతో పోల్చాడు
-
హెబ్రీ 2:14, 15—లోకంలోని చాలామందిలా మనం మరణ భయంతో జీవించాల్సిన అవసరం లేదని అపొస్తలుడైన పౌలు వివరించాడు
-
ఒక వ్యక్తి పుట్టిన రోజు కన్నా చనిపోయిన రోజే మేలు అని బైబిలు ఎందుకు చెప్తుంది?
బైబిలు మరణాన్ని ఏమని పిలుస్తుంది, అలాగే దేవుడు మరణాన్ని ఏం చేయబోతున్నాడు?
భవిష్యత్తులో పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని మనం ఎందుకు నమ్మవచ్చు?
యెష 26:19; యోహా 5:28, 29; అపొ 24:15
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
బైబిల్లో మొత్తం తొమ్మిది పునరుత్థానాల గురించి ఉంది. అందులో ఎనిమిది మంది భూమ్మీదికి పునరుత్థానం అయ్యారు, యేసుక్రీస్తేమో పరలోకానికి పునరుత్థానం అయ్యాడు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు చనిపోయారని ఎవరైనా బాధపడుతుంటే వాళ్లు ఈ పునరుత్థానాల నుండి ఓదార్పును, భవిష్యత్తు మీద ఆశను పొందవచ్చు
-
1రా 17:17-24—సీదోనులోని సారెపతు నగరంలో ఉన్న ఒక విధవరాలి కొడుకును ఏలీయా ప్రవక్త తిరిగి బ్రతికించాడు
-
2రా 4:32-37—ఎలీషా ప్రవక్త షూనేము నగరంలో ఉన్న ఒక బాబును తిరిగి బ్రతికించి అతని తలిదండ్రులకు అప్పగించాడు
-
2రా 13:20, 21—ఎలీషా ఎముకలు ఒక శవానికి తగలగానే, చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి బ్రతికాడు
-
లూకా 7:11-15—నాయీను నగరంలో పాడె మీద మోసుకెళ్తున్న ఒక విధవరాలి కుమారుడిని యేసు తిరిగి బ్రతికించాడు
-
లూకా 8:41, 42, 49-56—సమాజమందిర అధికారియైన యాయీరు కూతుర్ని యేసు తిరిగి బ్రతికించాడు
-
యోహా 11:38-44—మార్త, మరియల సహోదరుడైన లాజరును యేసు తిరిగి బ్రతికించి వాళ్లకు ఇచ్చాడు
-
అపొ 9:36-42—ఎన్నో మంచిపనులు చేసిన దొర్కా అనే క్రైస్తవురాలిని అపొస్తలుడైన పేతురు తిరిగి బ్రతికించాడు
-
అపొ 20:7-12—కిటికీ నుండి కిందపడి చనిపోయిన ఐతుకును అపొస్తలుడైన పౌలు తిరిగి బ్రతికించాడు
-
-
యెహోవా యేసును అమర్త్యమైన పరలోక ప్రాణిగా పునరుత్థానం చేశాడు, కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానాలన్నీ నెరవేరి తీరతాయి
-
మొట్టమొదట పరలోకానికి పునరుత్థానమై అమర్త్యమైన జీవం పొందింది యేసే, కానీ ఆ బహుమానం ఆయన ఒక్కడికే కాదు. 1,44,000 మంది అభిషిక్త అనుచరులు కూడా అలాంటి పునరుత్థానాన్నే పొందుతారు
-
కుటుంబ సభ్యులను, స్నేహితులను కోల్పోయి దుఃఖిస్తున్న వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు?