వయసు పైబడినవాళ్లు
వయసు పైబడినప్పుడు ఏమౌతుంది?
“ఊరట—అనారోగ్యం వల్ల లేదా వయసు పైబడడం వల్ల చేయాలనుకున్నంత చేయలేనప్పుడు” కూడా చూడండి
-
ఒక బైబిలు ఉదాహరణ:
-
ప్రస 12:1-8—రాజైన సొలొమోను వయసు పైబడడం వల్ల చూపు మందగిస్తుందని (“కిటికీల్లో నుండి చూసే స్త్రీలకు అంతా మసగ్గా కనిపిస్తుంది”), వినికిడి శక్తి తగ్గిపోతుందని (“గాయకురాళ్లందరి స్వరం తగ్గిపోతుంది”), ఇంకా ఇలాంటి వేరే సమస్యలు వస్తాయని పద్య రూపంలో చెప్పాడు
-
వయసు పైబడడం వల్ల కష్టాలు, ఇబ్బందులు ఉన్నా వృద్ధులు సంతోషంగా ఉండగలరా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1స 12:2, 23—యెహోవా ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉండడం ఎంత ముఖ్యమో ముసలివాడైన సమూయేలు ప్రవక్తకు తెలుసు
-
2స 19:31-39—ముసలివాడైన బర్జిల్లయి తన వెన్నంటే ఉన్నందుకు రాజైన దావీదు ఎంతో కృతజ్ఞత చూపించాడు, అయితే యెరూషలేములో తనకు సేవ చేయమని దావీదు బర్జిల్లయిని అడిగినప్పుడు ఆయన అణకువతో తన పరిమితుల్ని గుర్తించి దానికి ఒప్పుకోలేదు
-
కీర్త 71:9, 18—వయసు పైబడడం వల్ల తాను ఇక యెహోవాకు ఉపయోగపడనని దావీదు రాజు భయపడి, తనను త్రోసివేయద్దని యెహోవాను బ్రతిమాలుతూ తర్వాతి తరాలవాళ్లకు ఆయన గురించి చెప్పే బలాన్ని ఇవ్వమని అడిగాడు
-
లూకా 2:36-38—ప్రవక్త్రి, వృద్ధ విధవరాలు అయిన అన్న చూపించిన భక్తిని బట్టి, చేసిన నమ్మకమైన సేవను బట్టి దేవుడు ఆమెను దీవించాడు
-
వయసు పైబడినవాళ్లను విలువైనవాళ్లుగా ఎంచుతున్నానని యెహోవా ఎలా భరోసా ఇస్తున్నాడు?
కీర్త 92:12-14; సామె 16:31; 20:29; యెష 46:4; తీతు 2:2-5
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 12:1-4—అబ్రాహాముకు 75 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా అతని జీవితాన్ని మార్చేసే నియామకాన్ని ఇచ్చాడు
-
దాని 10:11, 19; 12:13—దానియేలు ప్రవక్తకు దాదాపు 90 ఏళ్లు ఉన్నప్పుడు ఒక దేవదూత అతని దగ్గరకు వచ్చి యెహోవా దృష్టిలో అతను అమూల్యమైనవాడని, అతని విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడని భరోసా ఇచ్చాడు
-
లూకా 1:5-13—వృద్ధులైన జెకర్యా, ఎలీసబెతులకు అద్భుతరీతిలో ఒక బాబు పుట్టేలా చేసి యెహోవా వాళ్లను దీవించాడు
-
లూకా 2:25-35—మెస్సీయ అవ్వబోయే పసిపిల్లవాడిని చూసే గొప్ప అవకాశం యెహోవా వృద్ధుడైన సుమెయోనుకు ఇచ్చాడు; సుమెయోను మెస్సీయ గురించి ఒక ప్రవచనం కూడా చెప్పాడు
-
అపొ 7:23, 30-36—మోషే ప్రవక్తకు 80 ఏళ్లు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల్ని నడిపించే బాధ్యత యెహోవా ఆయనకు ఇచ్చాడు
-
నమ్మకమైన వృద్ధులను మనం ఎలా చూడాలి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 45:9-11; 47:12—యోసేపు వృద్ధుడైన తన తండ్రి యాకోబును తన దగ్గరకు పిలిపించుకొని, చనిపోయేంత వరకు ఆయన బాగోగుల్ని చూసుకున్నాడు
-
రూతు 1:14-17; 2:2, 17, 18, 23—వృద్ధురాలైన నయోమికి రూతు తన మాటల ద్వారా, పనుల ద్వారా సహాయం చేసింది
-
యోహా 19:26, 27—యేసు హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు వాళ్ల అమ్మను చూసుకునే బాధ్యతను అపొస్తలుడైన యోహానుకు అప్పగించాడు
-
వయసు పైబడినవాళ్లకు సంఘంలో ఉన్న క్రైస్తవులు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?