సత్యారాధనలో వేరే మతాచారాలను కలపడం
అన్ని మతాల వాళ్లు ఒకే దేవున్ని ఆరాధిస్తున్నారా?
రకరకాల సిద్ధాంతాల్ని బోధించే మతాలన్నీ యెహోవాను సంతోషపెడతాయా?
మత్త 7:13, 14; యోహా 17:3; ఎఫె 4:4-6
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
యెహో 24:15—యెహోవాను సేవించాలా, లేదా వేరే దేవుళ్లను సేవించాలా అనే విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అని యెహోషువా చెప్పాడు
-
1రా 18:19-40—సత్యారాధకులు బయలు లాంటి వేరే దేవుళ్లను ఆరాధించకూడదని యెహోవా ఏలీయా ప్రవక్త ద్వారా చూపించాడు
-
అన్యదేవుళ్ల గురించి, వాళ్లకు చేసే ఆరాధన గురించి యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
ప్రజలు యెహోవానే ఆరాధిస్తున్నామని అనుకుంటూ, ఆ ఆరాధనలో ఆయన అసహ్యించుకునే ఆచారాల్ని కలిపితే ఆయనకు ఎలా అనిపిస్తుంది?
యెష 1:13-15; 1కొ 10:20-22; 2కొ 6:14, 15, 17
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
నిర్గ 32:1-10—తోటి ఇశ్రాయేలీయుల ఒత్తిడి వల్ల అహరోను దూడ విగ్రహాన్ని తయారుచేశాడు, తర్వాత “యెహోవాకు పండుగ” అని చెప్పుకుంటూ ఇశ్రాయేలీయులు విగ్రహపూజ చేశారు; దానివల్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది
-
1రా 12:26-30—ప్రజలు యెరూషలేము మందిరానికి వెళ్లకుండా రాజైన యరొబాము విగ్రహాల్ని చేయించి, అవి యెహోవాకు గుర్తుగా ఉన్నాయని చెప్పాడు; అలా అతను ప్రజలు పాపం చేయడానికి కారణం అయ్యాడు
-
వేరే దేవుళ్లను ఆరాధించే ప్రజలకు దూరంగా ఉండడం గురించి యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాడు?
తన ప్రజలు అన్యమత ఆచారాలు పాటించినప్పుడు యెహోవా ఏం చేశాడు?
న్యా 10:6, 7; కీర్త 106:35-40; యిర్మీ 44:2, 3
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1రా 11:1-9—రాజైన సొలొమోను తన విదేశీ భార్యల ఒత్తిడి వల్ల, వేరే దేవుళ్ల ఆరాధనను ప్రోత్సహించినప్పుడు యెహోవాకు కోపం వచ్చింది
-
కీర్త 78:40, 41, 55-62—ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటు వల్ల, విగ్రహపూజ వల్ల యెహోవా బాధపడ్డాడని, అందుకే వాళ్లను తిరస్కరించాడని ఆసాపు చెప్పాడు
-
దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న బోధల్ని యేసు ఎలా చూశాడు?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
మత్త 16:6, 12—యేసు పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధల్ని పులిసిన పిండితో పోల్చాడు; ఎందుకంటే తప్పుడు బోధలు త్వరగా పాకిపోయి, దేవుని వాక్యంలో ఉన్న స్వచ్ఛమైన సత్యాల్ని కలుషితం చేసేస్తాయి
-
మత్త 23:5-7, 23-33—యేసు శాస్త్రుల, పరిసయ్యుల వేషధారణను అలాగే తప్పుడు బోధల్ని ఖండించాడు
-
మార్కు 7:5-9—శాస్త్రులు, పరిసయ్యులు దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేసి, మనుషుల ఆచారాల్ని పట్టుకువేలాడుతున్నారనే విషయాన్ని యేసు బయటపెట్టాడు
-
తన శిష్యులందరూ వేర్వేరు మత గుంపులుగా విడిపోవాలని యేసు చెప్పాడా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
యోహా 15:4, 5—యేసు ద్రాక్షతీగ ఉదాహరణ ఉపయోగించి తన శిష్యులందరూ తనతోనే కాదు, తోటి క్రైస్తవులతో కూడా ఐక్యంగా ఉండాలని చెప్పాడు
-
యోహా 17:1, 6, 11, 20-23—యేసు తను చనిపోయే ముందురోజు రాత్రి తన శిష్యులందరూ ఐక్యంగా ఉండాలని అపొస్తలులతో కలిసి ప్రార్థించాడు
-
మొదటి శతాబ్దంలోని వేర్వేరు క్రైస్తవ సంఘాలు ఒకేలాంటి నమ్మకాలతో యెహోవాను ఒకేలా ఆరాధించారా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 11:20-23, 25, 26—అంతియొకయ అలాగే యెరూషలేము సంఘాలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ ఐక్యంగా ఉన్నాయి
-
రోమా 15:25, 26; 2కొ 8:1-7—కష్ట సమయంలో మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘాల్లోని వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ప్రేమ చూపించుకుంటూ, ఐక్యంగా ఉన్నట్టు నిరూపించుకున్నారు
-
యేసును నమ్ముతున్నామని చెప్పుకునే మతాలన్నిటినీ దేవుడు అంగీకరిస్తాడా?
క్రీస్తు అలాగే అపొస్తలుల బోధలకు లోబడని వాళ్ల ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడా?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
మత్త 13:24-30, 36-43—యేసు అబద్ధ క్రైస్తవుల్ని గురుగులతో పోలుస్తూ వాళ్లు ఎక్కువమంది అవుతారని, క్రైస్తవ సంఘంలోకి చొరబడతారని చెప్పాడు
-
1యో 2:18, 19—మొదటి శతాబ్దం చివరికల్లా చాలామంది క్రీస్తు విరోధులు వచ్చేశారని వృద్ధ అపొస్తలుడైన యోహాను చెప్పాడు
-
అబద్ధ సిద్ధాంతాలు బోధించేవాళ్లను, క్రైస్తవులకు తగని విధంగా ప్రవర్తించేవాళ్లను సంఘంలోనే ఉంచితే ఏం జరుగుతుంది?
ఐక్యంగా ఉండడానికి క్రైస్తవులు ఏం చేయాలి?
క్రైస్తవులు ఎందుకని అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండాలి?
అబద్ధ బోధల్ని బయటపెట్టడం ఎందుకు మంచిది, సరైనది?
అబద్ధ మతానికి చెందినవాళ్లు మనమీద దాడి చేసి, హింసించినప్పుడు మనం ఎందుకు ఆశ్చర్యపోం?