ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది?
మీరేమంటారు?
-
దేవుని గుప్పిట్లో.
-
మనుషుల గుప్పిట్లో.
-
వేరేవాళ్ల గుప్పిట్లో.
ఒక ప్రాచీన గ్రంథంలో ఇలా ఉంది:
“లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.”—1 యోహాను 5:19, కొత్త లోక అనువాదం.
“అపవాది [లేదా, సాతాను] పనుల్ని నాశనం చేయడానికే దేవుని కుమారుడు వెల్లడి చేయబడ్డాడు.”—1 యోహాను 3:8.
దీన్ని తెలుసుకోవడం వల్ల . . .
లోకంలో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయో అర్థమౌతుంది.—ప్రకటన 12:12.
లోకంలోని పరిస్థితులు మెరుగౌతాయనే నమ్మకం కలుగుతుంది.—1 యోహాను 2:17.
ఆ మాటలు ఎందుకు నమ్మవచ్చు?
మూడు కారణాలు పరిశీలించండి.
-
సాతాను పరిపాలన అంతం కాబోతుంది. మనుషుల్ని సాతాను గుప్పిట్లో నుండి విడిపించాలని యెహోవా నిర్ణయించాడు. ‘అపవాదిని నాశనం చేసి,’ అతని వల్ల వచ్చిన బాధలన్నిటినీ తీసేస్తానని దేవుడు మాటిచ్చాడు.—హెబ్రీయులు 2:14.
-
లోకాన్ని పరిపాలించడానికి దేవుడు యేసుక్రీస్తును ఎంచుకున్నాడు. ఇప్పుడు లోకాన్ని పరిపాలిస్తున్న సాతాను చాలా క్రూరుడు, స్వార్థపరుడు. కానీ యేసు అలా కాదు. యేసు పరిపాలన గురించి దేవుడు ఇలా చెప్పాడు: ‘ఆయన దీనుల మీద, పేదవాళ్ల మీద జాలి చూపిస్తాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి వాళ్లను రక్షిస్తాడు.’—కీర్తన 72:13, 14.
-
దేవుడు అబద్ధమాడడు. బైబిలు ఇలా చెప్తుంది: ‘దేవుడు అబద్ధమాడడం అసాధ్యం.’ (హెబ్రీయులు 6:18) యెహోవా ఏదైనా చేస్తానని మాటిస్తే, అది జరిగి తీరుతుంది! (యెషయా 55:10, 11) ఈ లోక పరిపాలకుడు ఖచ్చితంగా “బయటికి తోసేయబడతాడు.”—యోహాను 12:31.
ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .
సాతాను పరిపాలన అంతమైన తర్వాత ఈ లోకం ఎలా ఉంటుంది?
కీర్తన 37:10, 11; ప్రకటన 21:3, 4 లో దానికి జవాబు ఉంది.