10వ ప్రశ్న
భవిష్యత్తు గురించి బైబిలు ఏమని మాటిస్తుంది?
“నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”
“భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది.”
“ఇక ఎప్పుడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడు, సర్వోన్నత ప్రభువైన యెహోవా, ప్రజలందరి ముఖాల మీది కన్నీళ్లను తుడిచేస్తాడు.”
“అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి, చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి. కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు, మూగవాళ్ల నాలుక సంతోషంతో కేకలు వేస్తుంది. ఎడారిలో నీళ్లు ఉబుకుతాయి, ఎడారి మైదానంలో కాలువలు పారతాయి.”
“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”
“వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు. వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు, వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు. ఎందుకంటే నా ప్రజల ఆయుష్షు వృక్ష ఆయుష్షు అంత ఉంటుంది, నేను ఎంచుకున్న ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు.”