యోహానుకు ఇచ్చిన ప్రకటన 19:1-21
19 ఆ తర్వాత, చాలామంది దేవదూతల స్వరం లాంటి పెద్ద స్వరం పరలోకం నుండి రావడం నేను విన్నాను. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి!* రక్షణ, మహిమ, శక్తి మన దేవునికి చెందుతాయి.
2 ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.+ ఎందుకంటే, గొప్ప వేశ్య మీద ఆయన తీర్పు అమలుచేశాడు. ఆమె తన లైంగిక పాపంతో* భూమిని పాడుచేసింది. దేవుడు తన సేవకుల రక్తం విషయంలో ఆమె మీద పగ తీర్చుకున్నాడు.”+
3 వెంటనే రెండోసారి వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి!* ఆమె కాలిపోవడం వల్ల వచ్చే పొగ యుగయుగాలు పైకి లేస్తుంది.”+
4 అప్పుడు 24 మంది పెద్దలు, నాలుగు జీవులు మోకరించి, సింహాసనం మీద కూర్చునే దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు: “ఆమేన్! యెహోవాను స్తుతించండి!”*
5 అంతేకాదు, సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం ఇలా అంది: “సామాన్యులే గానీ గొప్పవాళ్లే గానీ దేవునికి భయపడే+ ఆయన దాసులారా, మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి.”
6 అప్పుడు ఒక శబ్దం విన్నాను. అది పెద్ద గుంపు స్వరంలా, అనేక జలాల శబ్దంలా, పెద్ద ఉరుముల శబ్దంలా ఉంది. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి,* సర్వశక్తిమంతుడూ+ మన దేవుడూ అయిన యెహోవా* రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు!+
7 మనం సంతోషిస్తూ సంబరపడుతూ ఆయన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే గొర్రెపిల్ల పెళ్లి దగ్గరపడింది, ఆయనకు కాబోయే భార్య పెళ్లికోసం సిద్ధంగా ఉంది.
8 శుభ్రమైన, మెరిసే, సన్నని నారవస్త్రం వేసుకోవడానికి ఆమెకు అనుమతి ఇవ్వబడింది. ఎందుకంటే, సన్నని నారవస్త్రం పవిత్రుల నీతికార్యాల్ని సూచిస్తుంది.”+
9 ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఈ మాటలు రాయి: గొర్రెపిల్ల గొప్ప పెళ్లివిందుకు ఆహ్వానించబడిన వాళ్లు ధన్యులు.”*+ అంతేకాదు అతను నాతో, “ఇవి దేవుని నమ్మదగిన మాటలు” అని కూడా అన్నాడు.
10 అప్పుడు నేను అతన్ని ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను. కానీ అతను, “వద్దు! అలా చేయొద్దు!+ నేను కూడా నీలాగే, యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడిన నీ సహోదరుల్లాగే ఒక దాసుణ్ణి మాత్రమే.+ దేవుణ్ణే ఆరాధించు!+ ఎందుకంటే యేసు గురించి సాక్ష్యమివ్వడమే ప్రవచనాల ఉద్దేశం”+ అని నాతో అన్నాడు.
11 ఆ తర్వాత, పరలోకం తెరవబడి ఉండడం నేను చూశాను. అప్పుడు ఇదిగో! ఒక తెల్లని గుర్రం+ కనిపించింది. దానిమీద కూర్చొని ఉన్న వ్యక్తికి నమ్మకమైనవాడు-సత్యవంతుడు+ అనే పేరు ఉంది. దేవుని నీతి ప్రమాణాల ప్రకారం ఆయన తీర్పుతీరుస్తాడు, యుద్ధం చేస్తాడు.+
12 ఆయన కళ్లు అగ్నిజ్వాలలా ఉన్నాయి.+ ఆయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు రాయబడివుంది, అది ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలీదు.
13 రక్తం మరకలు ఉన్న* పైవస్త్రాన్ని ఆయన వేసుకొని ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యం అనే పేరుంది.+
14 అంతేకాదు, పరలోక సైన్యాలు తెల్లని గుర్రాల మీద ఆయన్ని అనుసరిస్తున్నాయి. వాళ్లు శుభ్రమైన, తెల్లని, సన్నని నారవస్త్రాలు వేసుకొని ఉన్నారు.
15 దేశాల్ని నాశనం చేయడానికి ఆయన నోటి నుండి పదునైన, పొడవాటి ఖడ్గం+ వస్తోంది. ఆయన ఇనుప దండంతో వాళ్లను పరిపాలిస్తాడు.+ అంతేకాదు, సర్వశక్తిమంతుడైన దేవుని మహా కోపమనే ద్రాక్షతొట్టిని ఆయన తొక్కుతాడు.+
16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు+ ఆయన పైవస్త్రం తొడ భాగం మీద రాయబడివుంది.
17 అంతేకాదు, సూర్యుని మధ్యలో నిలబడివున్న ఒక దేవదూతను నేను చూశాను. అతను పెద్ద స్వరంతో అరిచి, ఆకాశం మధ్యలో* ఎగిరే పక్షులన్నిటితో ఇలా అన్నాడు: “ఇక్కడికి రండి, దేవుని గొప్ప విందు కోసం సమకూడండి.+
18 రాజుల మాంసాన్ని, సహస్రాధిపతుల* మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని,+ గుర్రాల మాంసాన్ని, వాటిమీద కూర్చున్న వాళ్ల మాంసాన్ని,+ అందరి మాంసాన్ని అంటే స్వతంత్రుల-దాసుల, సామాన్యుల-గొప్పవాళ్ల మాంసాన్ని తినడానికి రండి.”
19 ఆ తర్వాత, గుర్రం మీద కూర్చున్న వ్యక్తితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి క్రూరమృగం, భూమ్మీది రాజులు, వాళ్ల సైన్యాలు సమకూడడం+ నేను చూశాను.
20 గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ క్రూరమృగాన్ని, అబద్ధ ప్రవక్తను+ పట్టుకున్నాడు. క్రూరమృగం ముందు ఆశ్చర్యకార్యాలు చేసి, క్రూరమృగం గుర్తును వేయించుకున్నవాళ్లనూ+ దాని ప్రతిమను పూజించేవాళ్లనూ+ మోసం చేసింది ఈ అబద్ధ ప్రవక్తే. ఆ క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఇంకా బ్రతికుండగానే అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడ్డారు.+
21 అయితే మిగతావాళ్లు మాత్రం, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వచ్చిన పొడవాటి ఖడ్గంతో చంపబడ్డారు.+ వాళ్ల మాంసాన్ని పక్షులన్నీ కడుపునిండా తిన్నాయి.+
అధస్సూచీలు
^ లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “సంతోషంగా ఉంటారు.”
^ లేదా “రక్తం చిమ్మబడిన” అయ్యుంటుంది.
^ లేదా “తల పైన.”
^ వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.