మొదటి యోహాను 5:1-21

  • యేసుమీద విశ్వాసముంటే లోకాన్ని జయిస్తారు (1-12)

    • దేవుణ్ణి ప్రేమించడమంటే (3)

  • ప్రార్థనకున్న శక్తిమీద నమ్మకం (13-17)

  • దుష్టలోకంలో జాగ్రత్తగా ఉండండి (18-21)

    • లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది (19)

5  యేసే క్రీస్తు అని నమ్మే ప్రతీ ఒక్కరు దేవుని పిల్లలే.*+ తండ్రైన దేవుణ్ణి ప్రేమించే ప్రతీ ఒక్కరు ఆయన పిల్లల్ని కూడా ప్రేమిస్తారు.  మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు, మనం ఆయన పిల్లల్ని+ ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది.  దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.+  ఎందుకంటే, దేవుని పిల్లలంతా* లోకాన్ని జయిస్తారు.+ మనం మన విశ్వాసంతో లోకాన్ని జయించాం.+  లోకాన్ని జయించేది ఎవరు?+ యేసు దేవుని కుమారుడని విశ్వసించేవాళ్లే+ కదా?  నీళ్ల ద్వారా, రక్తం ద్వారా వచ్చింది ఆయనే, అంటే యేసుక్రీస్తే; ఆయన నీళ్లతో మాత్రమే కాదు,+ నీళ్లతో, రక్తంతో వచ్చాడు.+ దీని గురించి పవిత్రశక్తే సాక్ష్యం ఇస్తోంది,+ అది సత్యాన్ని వెల్లడి చేస్తుంది.*  ఈ మూడు సాక్ష్యం ఇస్తున్నాయి:  పవిత్రశక్తి,+ నీళ్లు,+ రక్తం;+ ఈ మూడూ ఒకే విధమైన సాక్ష్యం ఇస్తున్నాయి.  మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తాం కదా, దేవుని సాక్ష్యం ఇంకా గొప్పది. ఎందుకంటే స్వయంగా దేవుడే తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 10  దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచే వ్యక్తి, దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని తన హృదయంలో అంగీకరిస్తాడు. దేవుని మీద విశ్వాసంలేని వ్యక్తి దేవుణ్ణి అబద్ధాలకోరుగా చేశాడు,+ ఎందుకంటే తన కుమారుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని అతను విశ్వసించలేదు. 11  ఆ సాక్ష్యం ఏమిటంటే, దేవుడు మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చాడు, ఈ శాశ్వత జీవితం ఆయన కుమారునిలో ఉంది.+ 12  కుమారుణ్ణి అంగీకరించే వాళ్లకు ఈ శాశ్వత జీవితం ఉంటుంది; దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాళ్లకు ఈ శాశ్వత జీవితం ఉండదు.+ 13  దేవుని కుమారుని పేరు మీద విశ్వాసముంచే మీకు శాశ్వత జీవితం ఉందనే సంగతి మీరు తెలుసుకోవాలని మీకు ఈ విషయాలు రాస్తున్నాను. 14  మనకున్న నమ్మకం* ఏమిటంటే,+ మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.+ 15  మనం ఏది అడిగినా ఆయన వింటాడని మనకు తెలిస్తే, మనం ఆయన్ని ఏవైతే అడిగామో వాటిని పొందుతామని కూడా మనకు తెలుసు.+ 16  తన సహోదరుడు మరణశిక్షకు తగని పాపం చేయడం ఒక వ్యక్తి చూస్తే, అతను తన సహోదరుని కోసం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఆ సహోదరునికి, అవును మరణశిక్షకు తగని పాపం చేసినవాళ్లకు జీవాన్ని ఇస్తాడు.+ అయితే మరణశిక్షకు తగిన పాపం కూడా ఉంది.+ ఇలాంటి పాపం చేసేవాళ్ల గురించి ప్రార్థించమని నేను చెప్పట్లేదు. 17  అన్నిరకాల చెడ్డపనులు పాపమే,+ అయితే మరణశిక్షకు తగని పాపం కూడా ఉంది. 18  దేవుని పిల్లలెవ్వరూ అలవాటుగా పాపం చేయరని మనకు తెలుసు. దేవుని కుమారుడు* వాళ్లకు కాపలా ఉంటాడు కాబట్టి దుష్టుడు వాళ్లను తాకలేడు.* 19  మనం దేవునివైపు ఉన్నామని మనకు తెలుసు, కానీ లోకమంతా దుష్టుని గుప్పిట్లో* ఉంది.+ 20  అయితే దేవుని కుమారుడు వచ్చాడని+ మనకు తెలుసు. మనం సత్యదేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకునేలా కుమారుడు మనకు లోతైన అవగాహన ఇచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఆయనతో ఐక్యంగా ఉన్నాం. ఆయనే సత్యదేవుడు, ఆయనే శాశ్వత జీవితాన్ని ఇస్తాడు.+ 21  చిన్నపిల్లలారా, విగ్రహాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.+

అధస్సూచీలు

అక్ష., “దేవుని నుండి పుట్టినవాళ్లే.”
అక్ష., “దేవుని నుండి పుట్టిన ప్రతీది.”
లేదా “అదే సత్యం.”
లేదా “ధైర్యం.”
అక్ష., “దేవుని నుండి పుట్టినవాడు.”
లేదా “వాళ్లమీద తన పట్టు బిగించడు.”
లేదా “అధీనంలో.”