ఆగస్టు 26–సెప్టెంబరు 1
కీర్తన 78
పాట 97, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. ఇశ్రాయేలీయులు నమ్మకంగా లేకపోవడం—మనకు ఒక హెచ్చరికగా ఉంది
(10 నిమి.)
యెహోవా వాళ్లకోసం చేసిన ఆశ్చర్యకార్యాల్ని ఇశ్రాయేలీయులు మర్చిపోయారు (కీర్త 78:11, 42; w96 12/1 29-30 పేజీలు)
యెహోవా వాళ్లకు ఇచ్చిన మంచివాటి మీద ఇశ్రాయేలీయులు కృతజ్ఞత చూపించలేదు (కీర్త 78:19; w06 7/15 17వ పేజీ, 16వ పేరా)
ఇశ్రాయేలీయులు వాళ్లు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే బదులు పదేపదే నమ్మకద్రోహం చేస్తూ వచ్చారు (కీర్త 78:40, 41, 56, 57; w11-E 7/1 10వ పేజీ, 3-4 పేరాలు)
దీని గురించి ఆలోచించండి: యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 78:24, 25, అధస్సూచి—మన్నా “ఆకాశ ధాన్యం,” “దేవదూతల ఆహారం” అని ఎందుకు పిలువబడింది? (w06 7/15 11వ పేజీ, 4వ పేరా)
-
ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 78:1-22 (th 5వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 5వ పాఠంలో 5వ పాయింట్)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ఏదైనా కరపత్రాన్ని ఇచ్చి మాటలు మొదలుపెట్టండి. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 5వ పాఠంలో 4వ పాయింట్)
6. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(1 నిమి.) ఇంటింటి పరిచర్య. క్లుప్తంగా చెప్పమని ఇంటివ్యక్తి మిమ్మల్ని అడుగుతారు. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్)
7. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు అనే మాట ఎత్తకుండా, సహజంగా, మాటల మధ్యలో మీరు ఒక యెహోవాసాక్షి అని ఇంటివ్యక్తికి తెలియజేయండి. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 2వ పాఠంలో 4వ పాయింట్)
పాట 96
8. సువార్తికుడైన ఫిలిప్పు నుండి నేర్చుకోండి
(15 నిమి.) చర్చ.
బైబిలు ఎంతోమంది వ్యక్తుల గురించి చెప్తుంది. వాళ్లలో కొంతమంది చెడ్డగా ప్రవర్తించారు. ఇంకొంతమంది మంచి ఆదర్శాన్ని ఉంచారు. వాళ్ల గురించి నేర్చుకోవాలంటే సమయం, కృషి అవసరం. అయితే బైబిల్ని చదవడమే కాదు, నేర్చుకున్న పాఠాల గురించి బాగా ఆలోచించాలి, వాటికి తగ్గట్టు మన ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలి.
సువార్తికుడైన ఫిలిప్పుకు “పవిత్రశక్తితో తెలివితో నిండిన” క్రైస్తవుడు అనే పేరుంది. (అపొ 6:3, 5) ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
వాళ్ల నుండి నేర్చుకోండి—సువార్తికుడైన ఫిలిప్పు అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
-
ఫిలిప్పు పరిస్థితుల్లో ఉన్నట్టుండి మార్పు వచ్చినప్పుడు ఆయన చేసిన దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?—అపొ 8:1, 4, 5
-
ఫిలిప్పు అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు ఇష్టంగా వెళ్లినప్పుడు పొందిన దీవెనల నుండి మనమేం నేర్చుకోవచ్చు?—అపొ 8:6-8, 26-31, 34-40
-
ఫిలిప్పు, ఆయన కుటుంబం ఆతిథ్యం ఇవ్వడం ద్వారా పొందిన ప్రయోజనాల నుండి మనమేం నేర్చుకోవచ్చు?—అపొ 21:8-10
-
ఫిలిప్పు ఉదాహరణను పాటించడం ద్వారా వీడియోలోని కుటుంబం పొందిన ఆనందం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 14వ అధ్యాయంలో 11-20 పేరాలు