కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 107

దేవునిలా ప్రేమ చూపిద్దాం

దేవునిలా ప్రేమ చూపిద్దాం

(1 యోహాను 4:19)

  1. 1. నేర్పుతున్నాడు యెహోవా దేవుడు

    ప్రేమను చూపడం.

    ప్రతి పనిలో ఉంటుంది ఆ ప్రేమ;

    ప్రేమ మార్గం, తన మార్గం.

    ఇచ్చాడు తన ప్రియ కుమారుణ్ణి,

    క్షమించేందుకు మన తప్పులను.

    సాటిలేనిది మన తండ్రి ప్రేమ!

    ఔను ప్రేమే దేవుని మార్గం.

  2. 2. ప్రేమ మార్గంలో మనం నడుస్తుంటే

    చూపిస్తాం శ్రద్ధను.

    సోదరులపై నిజమైన ప్రేమ

    ఉంటే మనం చేస్తాం సాయం.

    దేవుని పైన మనకు ప్రేముంటే,

    సోదరులను కూడా ప్రేమిస్తాము.

    వాళ్ల తప్పుల్ని వెంటనే క్షమిస్తాం.

    అదే ప్రేమ, సోదర ప్రేమ.

  3. 3. ఐక్యమయ్యేలా ఒకే కుటుంబంలా

    చేసింది ఆ ప్రేమే.

    మన దేవుడే ఇచ్చాడీ వరాన్ని,

    ఆస్వాదిద్దాం మనందరం.

    దేవుని వాక్యం, ఆయనిచ్చే శక్తి

    సాయం చేస్తాయి ప్రేమ చూపించేలా.

    గుర్తుచేస్తారు మన సోదరులు:

    ప్రేమ మార్గం, యెహోవా మార్గం.