కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 151

ఆయన పిలుస్తాడు

ఆయన పిలుస్తాడు

(యోబు 14:13-15)

  1. 1. జీవితము ఆవిరి లాంటిది,

    ముగుస్తుంది క్షణంలో.

    ఉన్నదంతా నశించిపోతుంది,

    ముంచేస్తుంది దుఃఖంలో.

    చనిపోయిన వాళ్లను గూర్చి

    మాటిచ్చాడు దేవుడు:

    (పల్లవి)

    దేవుని పిలుపు విని

    లేస్తారు మృతులంతా.

    తన చేతి పనంటే

    ఆయనకెంతో ఇష్టం.

    కాబట్టి సందేహం వద్దు,

    దేవుడే లేపుతాడు.

    తన చేతిపనిగా

    జీవిస్తాం మనం నిత్యం.

  2. 2. మరువడు యెహోవా దేవుడు,

    తన స్నేహితులను.

    లేపుతాడు తన జ్ఞాపకంలో

    ఉన్న వాళ్లందరినీ.

    పరదైసులో జీవిస్తూ నిత్యం

    సంతోషిస్తాం అందరం.

    (పల్లవి)

    దేవుని పిలుపు విని

    లేస్తారు మృతులంతా.

    తన చేతి పనంటే

    ఆయనకెంతో ఇష్టం.

    కాబట్టి సందేహం వద్దు,

    దేవుడే లేపుతాడు.

    తన చేతిపనిగా

    జీవిస్తాం మనం నిత్యం.

(యోహా. 6:40; 11:11, 43; యాకో. 4:14 కూడా చూడండి.)