కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Marek M. Berezowski/Anadolu Agency via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

సంవత్సరం దాటినా ఆగని యుక్రెయిన్‌ యుద్ధం—ఆశ నింపే విషయం ఏదైనా బైబిల్లో ఉందా?

సంవత్సరం దాటినా ఆగని యుక్రెయిన్‌ యుద్ధం—ఆశ నింపే విషయం ఏదైనా బైబిల్లో ఉందా?

 2023, ఫిబ్రవరి 24, శుక్రవారానికి యుక్రెయిన్‌లో యుద్ధం మొదలై సరిగ్గా సంవత్సరం అయ్యింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, ఇప్పటిదాకా సుమారు 3,00,000 మంది యుక్రెయిన్‌ అలాగే రష్యా సైనికులు చనిపోయారు లేదా గాయపడ్డారు. దాదాపు 30,000 మంది పౌరులు కూడా చనిపోయారని ఒక అంచనా. అసలు సంఖ్య దీని కన్నా ఎక్కువే ఉండొచ్చు.

 విచారకరంగా, ఈ యుద్ధం కనుచూపుమేరలో ఆగేటట్లు కనపడట్లేదు.

  •   “యుక్రెయిన్‌ దేశంలోకి రష్యా బలగాలు అడుగుపెట్టి దాదాపు సంవత్సరం కావొస్తున్నా, యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఏదోక దేశం గెలుస్తుందని చెప్పలేం అలాగే రెండు దేశాలు మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తాయనీ చెప్పలేం.”—NPR (నేషనల్‌ పబ్లిక్‌ రేడియో), 2023, ఫిబ్రవరి 19.

 ఈ యుద్ధం, ఇలాంటి మిగతా యుద్ధాల వల్ల అమాయక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు, గుండెకోత అనుభవిస్తున్నారు. ఈ విషయంలో ఆశ నింపే ఏదైనా మంచి మాట బైబిల్లో ఉందా? యుద్ధాలే లేని రోజు ఎప్పటికైనా వస్తుందా?

అన్ని యుద్ధాలకు ముగింపు పలికే ఒక యుద్ధం

 మానవజాతిని కాపాడే ఒక యుద్ధం గురించి బైబిలు చెప్తుంది. ఆ యుద్ధమే హార్‌మెగిద్దోన్‌. “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం” అని బైబిలు దాన్ని పిలుస్తోంది. (ప్రకటన 16:14, 16) ఆ యుద్ధం ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎన్నో యుద్ధాలు మొదలుపెట్టి, ఎంతో వినాశనాన్ని సృష్టించిన మానవ ప్రభుత్వాల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. హార్‌మెగిద్దోన్‌ ఎలా శాశ్వత శాంతిని తెస్తుందో తెలుసుకోవడానికి, ఈ క్రింద ఉన్న ఆర్టికల్స్‌ చదవండి: