కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Thai Liang Lim/E+ via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

సోషల్‌ మీడియా పంజరంలో పిల్లలు—తల్లిదండ్రులకు బైబిలు ఇచ్చే సలహాలు

సోషల్‌ మీడియా పంజరంలో పిల్లలు—తల్లిదండ్రులకు బైబిలు ఇచ్చే సలహాలు

 “యువతలో మానసిక సమస్యలు విజృంభిస్తున్నాయి. అందుకు ముఖ్యమైన కారణం, సోషల్‌ మీడియానే.”—డాక్టర్‌ వివేక్‌ మూర్తి, U.S. సర్జన్‌ జనరల్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, జూన్‌ 17, 2024.

 పిల్లలు సోషల్‌ మీడియా పంజరంలో ఇరుక్కోకుండా తల్లిదండ్రులు ఎలా కాపాడొచ్చు? బైబిలు మంచి సలహాలు ఇస్తుంది.

తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?

 ఈ బైబిలు సలహాలు చూడండి.

 “వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.”—సామెతలు 14:15.

 సోషల్‌ మీడియా వల్ల రిస్క్‌ ఉంది కాబట్టి, మీ పిల్లాడిని దాన్ని వాడనిచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అతను ఇంత టైం అని పెట్టుకుని దానికి కట్టుబడతాడా, ఇంతకుముందులాగే ఫ్రెండ్స్‌తో బాగుంటాడా, చూడకూడని వాటికి దూరంగా ఉంటాడా, అంత మెచ్యూరిటీ అతనికి ఉందా అని ఆలోచించండి.

 “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.”—ఎఫెసీయులు 5:16.

 ఒకవేళ మీ పిల్లాడిని సోషల్‌ మీడియా వాడనిస్తే కొన్ని రూల్స్‌ పెట్టండి, ఆ రూల్స్‌ తనకెలా మేలు చేస్తాయో కూడా చెప్పండి. మీ పిల్లాడి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయేమో ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఒకవేళ మార్పులు వస్తే, సోషల్‌ మీడియా వాడడాన్ని తగ్గించాలని దానర్థం.

ఎక్కువ తెలుసుకోండి

 మనం “ప్రమాదకరమైన, కష్టమైన” కాలాల్లో జీవిస్తున్నామని బైబిలు చెప్తుంది. (2 తిమోతి 3:1-5) అలాగే, వాటిని గట్టెక్కడానికి తిరుగులేని సలహాలు కూడా ఇస్తుంది. టీనేజ్‌ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు అనే ఆర్టికల్‌లో తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపయోగపడే బైబిలు ఆర్టికల్స్‌ 20కి పైనే ఉన్నాయి.