వినియోగంపై షరతులు
సుస్వాగతం!
దేవుని గురించి, బైబిలు గురించి, యెహోవాసాక్షుల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ మీకు సహాయం చేస్తుంది. ఇందులో మీకు ఆసక్తికరంగా అనిపించిన సమాచారాన్ని మీరు చదవొచ్చు, చూడొచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా సైట్ నుండి ఇతరులు కూడా ప్రయోజనం పొందాలని మా కోరిక, అయితే దయచేసి ఇందులోని సమాచారాన్ని వేరే వెబ్సైట్లో గానీ అప్లికేషన్లో గానీ పెట్టకండి. కిందున్న వినియోగంపై షరతులు అనేదాని కింద సూచించినట్లు, ఇతరులకు ఈ వెబ్సైట్ గురించి చెప్పడం ద్వారా మీరు నేర్చుకున్నవాటిని వేరేవాళ్లతో పంచుకోవచ్చు.
కాపీరైట్
© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania. సర్వహక్కులు మావే.
ఈ వెబ్సైట్ ప్రకాశకులు, దీన్ని మెయింటెయిన్ చేస్తున్న వాళ్లు Watchtower Bible and Tract Society of New York, Inc. (“Watchtower”). వేరే విధంగా సూచించబడినప్పుడు తప్ప, ఈ వెబ్సైట్లో రాసివున్న సమాచారం, అలాగే మిగతా సమాచారం మొత్తం Watch Tower Bible and Tract Society of Pennsylvania (“Watch Tower”) మేధా సంపత్తిలో భాగం.
ట్రేడ్‌మార్క్‌లు
Adobe, Adobe లోగో, Acrobat, Acrobat లోగో అనేవి Adobe Systems Incorporated వాళ్ల ట్రేడ్‌మార్క్‌లు. Apple, iTunes, iPod అనేవి Apple Inc. వాళ్ల ట్రేడ్‌మార్క్‌లు. Microsoft, Microsoft లోగో, అలాగే Microsoft Office, Microsoft Office 365లతో సహా Microsoft సాఫ్ట్వేర్, ఇతర ఉత్పత్తుల పేర్లు అన్నీ Microsoft Inc వాళ్ల ట్రేడ్‌మార్క్‌లు. Android అనేది Google LLC వాళ్ల ట్రేడ్‌మార్క్. Android robot అనేది గూగుల్ సృష్టించి, షేర్ చేసిన వాటినుండి తయారు చేయబడింది లేదా మార్పులు చేయబడింది; అది Creative Commons 3.0 Attribution Licenseలో పొందుపర్చిన షరతులకు అనుగుణంగా ఉపయోగించబడుతుంది. (https://creativecommons.org/licenses/by/3.0/us/). మిగతా ట్రేడ్‌మార్క్‌లు, రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు అన్నీ వాటి సొంతదారుల ఆస్తి.
వినియోగంపై షరతులు, వెబ్సైట్ ఉపయోగించేందుకు అనుమతి
ఈ వినియోగంపై షరతులు మీరు ఈ వెబ్‌సైట్‌ని ఎలా ఉపయోగించాలో చెప్తాయి. ఈ వెబ్సైట్ ఉపయోగించడం ద్వారా మీరు ఈ వినియోగంపై షరతులకు, అలాగే ఈ వెబ్సైట్లో పెట్టిన వినియోగంపై అదనపు షరతులకు (మొత్తం కలిపి, “వినియోగంపై షరతులు”) అన్నిటికీ ఒప్పుకుంటున్నారు. మీ ఈ వినియోగంపై షరతుల్ని లేదా వాటిలోని ఏ భాగాన్నైనా ఒప్పుకోకపోతే, మీరు ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించకూడదు.
ఎలా ఉపయోగిస్తే సరిగ్గా ఉపయోగించినట్టు? కింద పెట్టిన నిబంధనల మేరకు మీరు ఇవి చేయవచ్చు:
-
మీ సొంత ఉపయోగం కోసం లేదా వాణిజ్యేతర కారణాల కోసం మీరు Watch Tower కాపీరైట్ ఉన్న చిత్రాల్ని, ఎలక్ట్రానిక్ ప్రచురణల్ని, సంగీతాన్ని, ఫోటోల్ని, సమాచారాన్ని, లేదా వీడియోల్ని ఈ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రింట్ తీసుకోవచ్చు.
-
ఈ సైట్లో ఉన్న డౌన్లోడ్ చేసుకోగల ప్రచురణల, వీడియోల, లేదా ఆడియోల లింక్‌లను లేదా వాటి ఎలక్ట్రానిక్ కాపీలను షేర్ చేయవచ్చు.
ఇవి మీరు చేయకూడదు:
-
ఈ వెబ్‌సైట్‌లోని చిత్రాల్ని, ఎలక్ట్రానిక్ ప్రచురణల్ని, ట్రేడ్మార్కుల్ని, సంగీతాన్ని, ఫోటోల్ని, వీడియోల్ని, లేదా ఆర్టికల్స్‌ని ఇంటర్నెట్లో (అంటే ఏ వెబ్సైట్లోనైనా, ఫైళ్లు షేర్ చేసే సైట్లోనైనా, వీడియోల్ని షేర్ చేసే సైట్లోనైనా, లేదా సోషల్ నెట్‌వర్క్‌లోనైనా) పోస్ట్ చేయడం.
-
ఈ వెబ్‌సైట్‌లోని చిత్రాల్ని, ఎలక్ట్రానిక్ ప్రచురణల్ని, ట్రేడ్మార్కుల్ని, సంగీతాన్ని, ఫోటోల్ని, సమాచారాన్ని, లేదా వీడియోల్ని ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్తోపాటైనా లేదా దానిలో భాగంగా పంచిపెట్టడం (ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉపయోగించుకునేలా అలాంటివాటిని సర్వర్కి అప్లోడ్ చేయడంతో సహా).
-
వాణిజ్య కారణాల్ని బట్టి లేదా డబ్బు కోసం (అందులో లాభం లేకపోయినా సరే) ఈ వెబ్‌సైట్‌లోని చిత్రాల్ని, ఎలక్ట్రానిక్ ప్రచురణల్ని, ట్రేడ్మార్కుల్ని, సంగీతాన్ని, ఫోటోల్ని, సమాచారాన్ని, లేదా వీడియోల్ని పునరుత్పత్తి చేయడం, నకలు చేయడం, కాపీ చేయడం, పంచిపెట్టడం లేదా ఇతర విధాల్లో లబ్ది పొందడం.
-
ప్రత్యేకంగా ఈ సైట్‌లోని సమాచారాన్ని, HTMLని, చిత్రాల్ని, టెక్స్ట్‌ని సేకరించడానికో వాటిని కాపీ, డౌన్లోడ్, ఎక్స్ట్రాక్ట్, లేదా హార్వెస్ట్ చేయడానికో, తుడిచేయడానికో రూపొందిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను, పరికరాలను, లేదా టెక్నిక్లను పంచిపట్టే ఉద్దేశంతో తయారుచేయడం. (ఈ సైట్‌లోని పబ్లిక్ ఏరియాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఫైళ్లను, అంటే EPUB, PDF, MP3, MP4 ఫైళ్లను డౌన్లోడ్ చేయడానికి రూపొందించబడిన ఉచిత, వాణిజ్యేతర అప్లికేషన్లను పంచిపెట్టే విషయంలో ఎలాంటి నిషేధం లేదు.)
-
వెబ్‌సైట్‌ని లేదా దాని సేవల్ని దుర్వినియోగం చేయడం, అంటే ప్రత్యేకంగా ఇవ్వబడిన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో వెబ్సైట్ లేదా దాని సేవల్లో జోక్యం చేసుకోవడం, అలాంటి పద్ధతిలో ఆక్సెస్ చేయడం.
-
వెబ్‌సైట్‌కి హానిచేసే, అది అందుబాటులో ఉండడాన్ని లేదా వాడుకోవడాన్ని అడ్డుకునే లేదా అడ్డుకునే అవకాశమున్న విధాల్లో వెబ్‌సైట్‌ని ఉపయోగించడం; లేదా అవినీతికరమైన, చట్టవిరుద్ధమైన, మోసకరమైన, లేదా హానికరమైన పద్ధతిలో లేదా అలాంటి ఉద్దేశాల కోసం, పనుల కోసం వెబ్‌సైట్‌ని ఉపయోగించడం.
-
మార్కెటింగ్‌కి సంబంధించిన ఎలాంటి ఉద్దేశాల కోసమైనా ఈ వెబ్‌సైట్‌ని గానీ, ఇందులోని చిత్రాలు, ఎలక్ట్రానిక్ ప్రచురణలు, ట్రేడ్‌మార్క్‌లు, సంగీతం, ఫోటోలు, సమాచారం లేదా వీడియోల్లో దేన్ని గానీ ఉపయోగించడం.
-
ఈ వెబ్సైట్ గూగుల్ మ్యాప్స్ సర్వీసెస్‌ని ఉపయోగిస్తుంది. అది థర్డ్-పార్టీ సర్వీస్, దాన్ని మేము నియంత్రించం. ఈ వెబ్సైట్లో మీరు గూగుల్ మ్యాప్స్ సేవలు ఉపయోగిస్తున్నప్పుడు ప్రస్తుత గూగుల్ మ్యాప్స్/గూగుల్ ఎర్త్ ఎడిషనల్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్‌కి కట్టుబడి ఉంటారు. అప్డేట్స్ మాకు తెలియజేయబడవు కాబట్టి గూగుల్ మ్యాప్స్ సేవలను ఉపయోగించుకునే ముందు షరతులను దయచేసి సమీక్షించండి. మీరు ఆ షరతులకు అంగీకరించకపోతే గూగుల్ మ్యాప్స్ సేవలను ఉపయోగించకండి. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ వెబ్‌సైట్‌కు యూజర్ డేటా ఏదీ తిరిగి ఇవ్వబడదు.
వైద్య విభాగం
ఈ వెబ్‌సైట్‌లోని వైద్య విభాగంలోని (“వైద్య విభాగం”) విషయాలు సమాచారం కోసం మాత్రమే. అవి వైద్య సలహాలు కావు. వాటిని నిపుణుల వైద్య సలహాకు గానీ, రోగ నిర్ధారణకు గానీ చికిత్సకు గానీ ప్రత్యామ్నాయంగా చూడకూడదు. వైద్య విభాగంలో పేర్కొనబడే ఎలాంటి పరీక్షల్ని, వైద్యుల్ని, ఉత్పత్తుల్ని, పద్ధతుల్ని, అభిప్రాయాల్ని లేదా ఇతర సమాచారాన్ని వైద్య విభాగం సిఫారసు చేయట్లేదు, వాటికి మద్దతు తెలపట్లేదు.
ఒకానొక వైద్య పరిస్థితి లేదా చికిత్స గురించి ఎప్పుడైనా మీకు ఒక ప్రశ్న వస్తే, వైద్యుణ్ణి గానీ వైద్య సంరక్షణ అందించే అర్హుడైన వ్యక్తిని గానీ సలహా అడగండి.
వైద్య విభాగంలో ఖచ్చితమైన, తాజా సమాచారం ఉండేలా చేయడానికి ఈ వెబ్సైట్ కృషిచేసింది. అయితే, వైద్య విభాగంలో మీరు పొందే సమాచారం ఎలాంటి ప్రకటిత లేదా పరోక్ష వారంటీ లేకుండా “ఉన్నది ఉన్నట్టుగా” అందజేయబడుతుంది. వైద్య విభాగానికి సంబంధించిన ప్రకటిత లేదా పరోక్ష వారంటీలతో అంటే, విక్రయ యోగ్యత లేదా ఒక పనికి ఉపయోగపడే విషయంలో యోగ్యత గురించిన పరోక్ష వారంటీలతో, ఇతర వారంటీలతో ఈ వెబ్‌సైట్‌కి ఎలాంటి సంబంధం లేదు. వైద్య విభాగం నుండి పొందే ఏ సమాచారం విశ్వసనీయత, ఖచ్చితత్వం, యుక్త కాలం, ప్రయోజకత్వం, లేదా సంపూర్ణత గురించి ఈ వెబ్సైట్ ఎలాంటి వారంటీ ఇవ్వట్లేదు. వైద్య విభాగ సమాచారంలోని ఎలాంటి తప్పులకు లేదా దానిలో చేర్చనివాటికి ఈ వెబ్సైట్ జవాబుదారీ కాదు, ఆ బాధ్యత దీనిమీద లేదు. వైద్య విభాగంలోని ఏ సమాచారం మీదైనా ఆధారపడితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. వైద్య విభాగాన్ని ఉపయోగించడం వల్ల లేదా ఉపయోగించలేకపోవడం వల్ల చేసే ఎలాంటి క్లెయింలకు లేదా నష్టానికి (ఆకస్మిక లేదా పర్యవసానంగా కలిగిన నష్టం, వ్యక్తిగత హాని/చట్టపరంగా లేని మరణం, కోల్పోయిన లాభాలు, లేదా పోగొట్టుకున్న సమాచారం వల్ల గానీ వ్యాపారంలో అంతరాయం వల్ల గానీ కలిగిన నష్టంతో సహా ఇతరమైన వాటికి) ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ వెబ్సైట్ జవాబుదారీ కాదు; ఆ క్లెయిం లేదా నష్టం ఒక వారంటీ, కాంట్రాక్టు, టోర్టు, ఇతర చట్టబద్ధ థియరీ ఆధారంగా ఉన్నా లేకున్నా, అలాంటి క్లెయింలు లేదా నష్టాలకు అవకాశముందని ఈ వెబ్‌సైట్‌కి సలహా ఇవ్వబడిన ఇవ్వబడకపోయినా, వాటికి ఈ వెబ్సైట్ జవాబుదారీ కాదు.
వారంటీల డిస్క్లైమర్, జవాబుదారీ పరిమితి
ఈ వెబ్సైట్, అలాగే దీని ద్వారా మీకు లభ్యమయ్యే ఎలాంటి సమాచారమైనా, ఇతర సేవలైనా అవి Watchtower ద్వారా “ఉన్నది ఉన్నట్టుగా” అందజేయబడుతున్నాయి. Watchtower వేటికీ ప్రాతినిధ్యం వహించట్లేదు, అలాగే ఎలాంటి ప్రకటిత లేదా పరోక్ష వారంటీలు ఇవ్వట్లేదు.
ఈ వెబ్సైట్ వైరస్ల నుండి, ఇతర హానికర అంశాల నుండి సురక్షితం అని Watchtower హామీ ఇవ్వట్లేదు. ఏదైనా సేవను ఉపయోగించుకోవడం వల్ల, లేదా ఈ వెబ్సైట్ ద్వారా మీకు లభ్యమయ్యే ఎలాంటి సమాచారం వల్ల లేదా ఇతర సేవల వల్ల తలెత్తే ఏ రకమైన నష్టాలకు, అది ప్రత్యక్ష, పరోక్ష, ఆకస్మిక, శిక్షార్హ, పర్యవసాన (లాభాలు పోగొట్టుకోవడం కూడా) నష్టమైనా, వేరే రకమైన నష్టమైనా Watchtower దానికి జవాబుదారీ కాదు.
వినియోగంపై షరతుల ఉల్లంఘన
ఆ ‘వినియోగంపై షరతులు’ కింద ఉన్న Watchtower ఇతర హక్కులకు భంగం కలిగించకుండా మీరు ఈ వినియోగంపై షరతుల్ని ఏ విధంగానైనా ఉల్లంఘిస్తే, ఆ ఉల్లంఘనతో వ్యవహరించడానికి Watchtowerకి ఏ చర్య తీసుకోవడం సముచితమని అనిపిస్తే అది ఆ చర్య తీసుకుంటుంది. ఆ చర్యల్లో, మీరు కొంతకాలం ఈ వెబ్‌సైట్‌ని ఆక్సెస్ చేసే వీలు లేకుండా చేయడం, మీరు ఈ వెబ్‌సైట్‌ని ఆక్సెస్ చేయకుండా నిషేధించడం, మీ IP అడ్రస్ ఉపయోగించుకునే కంప్యూటర్లు ఈ వెబ్‌సైట్‌ని ఆక్సెస్ చేయకుండా వాటిని బ్లోక్ చేయడం, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ని సంప్రదించి మీరు ఈ వెబ్‌సైట్‌ని ఆక్సెస్ చేయకుండా బ్లోక్ చేయమని కోరడం, అలాగే/లేదా మీ మీదికి చట్టపరమైన చర్య తీసుకురావడం లాంటివి ఉండవచ్చు.
మార్పు
Watchtower ఈ ‘వినియోగంపై షరతుల్ని’ అప్పుడప్పుడు రివైజ్ చేయవచ్చు. రివైజ్ చేసిన ‘వినియోగంపై షరతులు’ ఈ వెబ్సైట్లో ప్రచురించబడిన తేదీ నుండి, ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించే విషయంలో అవి వర్తిస్తాయి. మీరు ప్రస్తుత వర్షన్‌తో పరిచయం కలిగివున్నారని నిర్ధారించుకోవడానికి దయచేసి ఈ పేజీని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.
చట్టం, అధికారపరిధి
‘శాసనాల పరస్పర విరుద్ధత’తో నిమిత్తం లేకుండా, ఈ ‘వినియోగంపై షరతులు’ అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర చట్టాల ద్వారా నిర్దేశించబడతాయి, వాటి ప్రకారం అన్వయించబడతాయి. ఈ ‘వినియోగంపై షరతులకు’ సంబంధించిన ఎలాంటి చట్టపరమైన చర్యైనా, అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర అధికారపరిధిలో ఉన్న రాష్ట్రంలోకి లేదా ఫెడరల్ కోర్టులోకి తీసుకురావడం జరుగుతుంది.
వేరుపరచగలిగే వెసులుబాటు
సమర్థ అధికారపరిధి గల ఒక కోర్టు, ఈ ‘వినియోగంపై షరతులు’ కల్పించే ఒకానొక సదుపాయం నిరర్థకమైనదని, చెల్లదని, దాన్ని అమలుపర్చడం వీలుకాదని, లేదా అది చట్టవిరుద్ధమని నిర్ణయిస్తే, ఇతర సదుపాయాలు ఎప్పటిలాగే అమల్లో ఉంటాయి. ఈ ‘వినియోగంపై షరతుల్లో’ ఉన్న ఏదైనా సదుపాయాన్ని అమలుపర్చడంలో Watchtower విఫలమైతే, అది ఆ సదుపాయాన్ని గానీ ఆ సదుపాయాన్ని అమలుపర్చే హక్కును గానీ పరిత్యాగం చేసినట్టు కాదు, దాన్ని అలా అర్థం చేసుకోకూడదు.
పూర్తి అగ్రీమెంట్
ఈ ‘వినియోగంపై షరతులు’ మీరు ఈ వెబ్సైట్ ఉపయోగించే విషయంలో మీకూ, Watchtowerకూ మధ్య పూర్తి అగ్రీమెంట్గా పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ ఉపయోగించడానికి సంబంధించి ఇంతకుముందున్న అగ్రీమెంట్లన్నిటి స్థానంలో ఇది అమలులో ఉంటుంది.